IND Vs AUS: భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్‌లో స్టార్ హీరో సందడి.. రోహిత్, కోహ్లీలకు ప్రత్యేక పేర్లు
Tollywood Hero Nani meets Sunil Gavaskar & Aaron Finch. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్.. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆరోన్ ఫించ్‌తో నాని మాట్లాడాడు.
Dasara Movie Hero Nani gave Special Names to Rohit Sharma & Virat Kohli : 'నాచురల్ స్టార్' నాని హీరోగా తెరకెక్కిన సినిమా 'దసరా'. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన దసరా సినిమాలో నాని ఇంతకుముందు ఎన్నడూ కనిపించినటువంటి రస్టిక్ పాత్రలో కనిపించనున్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దసరా సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది.
దసరా సినిమా ప్రచారంలో భాగంగా హీరో నాని ఆదివారం విశాఖపట్నం వెళ్లాడు. వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia 2nd ODI) మధ్య రెండో వన్డే నేడు విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో నాని సందడి చేశాడు. భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్.. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆరోన్ ఫించ్‌తో నాని మాట్లాడాడు. ఈ క్రమంలో ఫించ్‌కు ‘దసరా’ చిత్రంలోని ‘ధూమ్ ధామ్’ సిగ్నేచర్ స్టెప్‌ను నేర్పించాడు. నాని, ఫించ్ కలసి స్టెప్స్ వేస్తుంటే విశాఖపట్నం స్టేడియం మార్మోగిపోయింది. ఈలలు, కేకలతో ఫాన్స్ సందడి చేశారు.
తెలుగు కామెంటరీ టీమ్‌తో హీరో నాని మాట్లాడుతూ అభిమానులకు కావాల్సిన మజాను అందించాడు. తన సినిమాల పేర్లు ఏ క్రికెటర్లకు బాగుంటాయని సరదాగా చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ‘జెంటిల్‌మెన్’ పేరు బాగుంటుందని నాని చెప్పాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘గ్యాంగ్ లీడర్’ పేరు ఇచ్చిన నాని.. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ‘పిల్ల జమిందార్’ బాగుంటుందన్నాడు. తనకు బాగా ఇష్టమైన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని, క్రికెట్ దిగ్గజం ఆటకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. సచిన్ ఔట్ కాగానే టీవీలు ఆపేసే వాళ్లం అని నాని చెప్పుకొచ్చాడు.
రెండో వన్డేలో భారత్ తీవ్రంగా నిరాశపరిచింది. 26 ఓవర్లు మాత్రమే ఆడి 117 పరుగులకు ఆలౌటయ్యింది. మిచెల్ స్టార్క్, సీన్ అబాట్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ వెలవెలబోయింది. విరాట్ కోహ్లీ(31), అక్షర్ పటేల్ (29) కూడా రాణించకపోతే.. భారత్ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), శుభమాన్ గిల్ (0), సూర్యకుమార్ యాదవ్ (0), హార్దిక్ పాండ్యా (1) పూర్తిగా నిరాశపరిచారు.
Also Read: Cheapest Smartphone 2023: రూ 21 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 899కే.. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.