సన్ రైజర్స్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ పదవిని కోల్పోయిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్  జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో షెన్‌ముగమ్ ధృవీకరించారు. కొత్త కెప్టెన్ ఎవరన్నది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అంతకు ముందు స్మిత్ ను రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే..! రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ పదవి నుంచి స్మిత్ ను తప్పించి సారథ్య బాధ్యతలను రహానేకు అప్పగించింది ఆర్ఆర్ యాజమాన్యం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బాల్ ట్యాంపరింగ్ ఉదంతం నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యంఈ నిర్ణయం తీసుకున్నది. కొత్త కెప్టెన్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు సన్‌రైజర్స్ సీఈవో తాజాగా ట్వీట్ చేశారు. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్, బ్యాంక్రాఫ్ట్, వార్నర్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా.. డేవిడ్ వార్నర్ స్థానంలో శిఖర్ ధావన్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.