David Warner: పఠాన్ లుక్‌లో అదగొట్టిన డేవిడ్ వార్నర్.. ఆస్కార్ గ్యారంటీ
David Warner Pathan Look: సోషల్ మీడియాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రచ్చ మాములుగా లేదు. సినిమా డైలాగ్స్, పాటలకు స్ఫూఫ్‌లు చేసి వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అలరిస్తున్నాడు. తాజాగా పఠాన్ మూవీలో షారూఖ్ ఖాన్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
David Warner Pathan Look: వచ్చే నెల నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. కంగారూ జట్టు ఫిబ్రవరి 1న భారత్‌కు చేరుకోనుంది. ఆస్ట్రేలియా జట్టు కొన్ని రోజుల పాటు బెంగళూరులో ఉంటుంది. శిక్షణ శిబిరంలో అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆసీస్ జట్టు నాగ్‌పూర్‌కు బయల్దేరుతుంది. పాట్ కమిన్స్ సారథ్యంలోని జట్టు ఈ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ టెస్టు సిరీస్‌కు ముందు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు. పఠాన్ మూవీ లుక్‌లో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వార్నర్ భాయ్ యాక్టివ్‌గా ఉంటాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినా వార్నర్‌కు ఇండియాలో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఆటతోనే కాకుండా.. సోషల్ మీడియా ద్వారా కుడా వార్నర్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో వార్నర్ తెలుగు పాటలకు స్టెప్పులేసి మెప్పించాడు. మాస్ డైలాగులు కూడా పేల్చాడు. బుట్ట బొమ్మ పాటకు వార్నర్ వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాష పాటలు, ఫ్యాన్స్ ఎడిట్ చేసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటాడు. క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా అంతే స్పీడ్‌గా ఉంటాడు ఈ ఆసీస్ ఓపెనర్.
తాజాగా పటాన్ మూవీలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాక్‌లో కనిపించిన వీడియో అభిమానులకు తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో డేవిడ్ వార్నర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. షారుఖ్ ఖాన్ ఫేస్ ప్లేస్‌లో తన చిత్రం పెట్టాడు. 'వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలవా..? #legend #icon' అని వార్నర్ క్యాప్షన్ ఇచ్చాడు. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. షేర్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్‌కు ఆస్కార్ గ్యారంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగ్‌పూర్‌లో జరగనుంది. కాగా రెండో టెస్టు ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనుంది. మూడో టెస్టు మార్చి 1 నుంచి 5 వరకు ధర్మశాలలో, నాలుగో టెస్టు మార్చి 9 నుంచి 13 వరకు అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. భారత్‌కు ఈ సిరీస్ కీలకం. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే.. కంగారూ జట్టును మెరుగైన మార్జిన్‌తో ఓడించాలి.
Also Read: Minister Roja: లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లోకే.. తారకరత్న త్వరగా కోలుకోవాలి: మంత్రి రోజా
Also Read: Ind Vs NZ: కివీస్‌తో రెండో టీ20.. ఎవరూ ఊహించని రెండు మార్పులు.. పృథ్వీ షా ఎంట్రీ కన్ఫార్మ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి