DC Vs KKR Score Updates: విశాఖలో పరుగుల వరద పారింది.  బంతులపై బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇక సునీల్‌ నరైన్‌ బ్యాట్‌తో ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. కోల్‌కత్తా బ్యాటింగ్‌తో దుమ్ముధుళిపేయడంతో ఐపీఎల్‌ చరిత్రలో రెండో అతిపెద్ద స్కోర్‌ నమోదైంది. భారీ లక్ష్యం ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్‌ సొంత మైదానంలో పరాజయం పాలైంది. 106 పరుగుల తేడాతో ఢిల్లీని కోల్‌కత్తా చిత్తుచేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో కేకేఆర్‌ ఈ మ్యాచ్‌తో వరుసగా హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం చేరుకోగా.. మూడో ఓటమితో ఢిల్లీ కింద నుంచి రెండో స్థానానికి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


Also Read: MI Vs RR Live: ముంబై హ్యాట్రిక్‌ ఓటమి.. రాజస్థాన్‌ చేతిలో ఘోర పరాభవం.. ఆర్‌ఆర్‌ హ్యాట్రిక్‌ విజయం


 


 


ఐపీఎల్‌ 2024 సీజన్‌లో పరుగులు చేయడం ఇంత సులువా అనిపించేలా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. స్కోర్‌ బోర్డు పరుగులు పెడుతోంది. అలాంటి మాదిరే కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్‌గా దిగిన సునీల్‌ నరైన్‌ తన దూకుడైన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. 39 బంతుల్లో 85 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. 7 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. తొలి బంతి నుంచి దూకుడైన ఆటతో జట్టుకు భారీ లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. ఫిల్‌ సాల్ట్‌ (18) పర్వాలేదనిపించగా.. అంగక్రిష్‌ రఘువంశీ (54) అర్ధ శతకంతో రాణించగా.. ఆండ్రె రసెల్‌ (41) సత్తా చాటాడు.

Also Read: IPL DC Vs CSK Live: చెన్నైకి ఢిల్లీ షాక్‌.. చాన్నాళ్లకు ధోనీ మెరిసినా తప్పని ఓటమి


 


 


అప్పటికే భారీగా నమోదైన స్కోర్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ (18), రింకూ సింగ్‌ (26) కొంత పరుగులు జోడించారు. వెంకటేశ్ అయ్యర్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, మిచెల్‌ స్టార్క్‌ ఇలా కొన్ని పరుగులు చేసి అత్యధిక స్కోర్‌ చేయడానికి కృషి చేశారు. కానీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇటీవల నెలకొల్పిన అత్యధిక స్కోర్‌కు కేకేఆర్‌ ఐదు పరుగుల దూరంలో నిలిచింది. కాకపోతే కేకేఆర్‌ సాధించిన 272 పరుగులు ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. 


తొలి బంతి నుంచే దూకుడుగా ఆట మొదలుపెట్టిన కోల్‌కత్తా బ్యాటర్లను ఢిల్లీ బౌలర్లు నియంత్రించలేకపోయారు. భారీ లక్ష్యం దిశగా వెళ్తుంటే అడ్డుకట్ట వేయలేకపోయారు. టాపార్డర్‌ను త్వరగా దెబ్బతీయకుండా కొనసాగించడంతో భారీ లక్ష్యం ఢిల్లీ ముందు నిలబడింది. అన్రిచ్‌ నోర్ట్జే 59 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ (2), ఖలీల్‌ అహ్మద్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ తీశారు. ఏడు మంది బౌలర్లను ఢిల్లీ బరిలోకి దించడం చూస్తుంటే కోల్‌కత్తా బ్యాటర్ల బీభత్సం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


భారీ లక్ష్యం ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏమాత్రం ఆందోళన చెందలేదు. కొండంత లక్ష్యం ఉన్నా కూడా ఛేధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది. 17.2 బంతుల్లో 166 పరుగులు చేసి కోల్‌కత్తా కుప్పకూలింది. ఓపెనర్లుగా దిగిన డేవిడ్‌ వార్నర్‌ (18), పృథ్వీ షా (10) అతి స్వల్ప స్కోర్‌ చేసి మైదానం వీడారు. మిచెల్‌ మార్ష్‌, అభిషేక్‌ పరేల్‌ డకౌట్‌తో బయటకు వెళ్లడంతో ఢిల్లీ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన రిషబ్‌ పంత్‌ (55) ఎలాంటి ఆందోళన లేకుండా బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (54) దూకుడుగా ఆడారు.

నాలుగు వికెట్లు పడ్డాయనే ఆందోళన లేకుండా వారిద్దరూ ప్రశాంతంగా గ్రౌండ్‌లో నిలబడ్డారు. పవర్‌ ప్లే తర్వాత కూడా వారి బ్యాటింగ్‌ దూకుడుగానే ఉంది. అనంతరం వచ్చిన వారంతా అంతగా స్కోర్‌ చేయలేదు. తమ బ్యాటర్లు భారీ లక్ష్యం నిర్దేశించి తమ బాధ్యత పూర్తి చేయగా.. వారికి తోడుగా కేకేఆర్‌ బౌలర్లు నిలిచారు. వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి మూడు వికెట్ల చొప్పున తీసి ఢిల్లీని భారీగా దెబ్బతీశారు. మిచెల్‌ స్టార్క్‌ రెండు వికెట్లు, ఆండ్రె రసెల్‌, సునీల్‌ నరైన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.


హ్యాట్రిక్‌ విజయంతో కోల్‌కత్తా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారీ వ్యత్యాసంతో ఢిల్లీపై గెలవడంతో కోల్‌కత్తా నెట్‌ రన్‌రేట్‌ను భారీగా పెంచేసుకుని మొదటి స్థానంలో డీసీ నిలబడింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook