Deepak Chahar ruled out from T20 World Cup 2022, Shardul Thakur replaces: టీ20 ప్రపంచకప్‌ 2022కు ముందు భారత జట్టుకు అన్నీ అపశకునాలే ఎదురవుతూన్నాయి. వరుసగా ప్లేయర్స్ అందరూ గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పొట్టి టోర్నీకి దూరం కాగా.. ఈ జాబితాలో స్వింగ్ మాస్టర్ దీపక్ చహర్ చేరాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌ నుంచి దీపక్ చహర్ తప్పుకున్నాడు. బీసీసీఐ వర్గాల నుంచి ఈ సమాచారం బయటికి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ద్రువీకరించాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీ20 ప్రపంచకప్ 2022 ఆడటానికి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన భారత జట్టులో దీపక్ చహర్ రిజర్వ్ ప్లేయర్. నెట్ ప్రాక్టీస్‌లో జట్టుతో పాటు ఉన్న దీపక్.. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నాడు. గాయం తీవ్రమైంది కాబట్టి అతడిని మెగా టోర్నీ నుంచి తప్పించారట. దీపక్ స్థానంలో ఆల్‌రౌండర్‌ శార్దుల్ ఠాకూర్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్టు సమాచారం తెలుస్తోంది. ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడట. ఆరంభంలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచే దీపక్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. 



గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో వెటరన్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని బీసీసీఐ ఎంపిక చేసిందట. షమీ కూడా రేపు ఆస్ట్రేలియా వెళ్లడం ఖాయమైంది. శార్దుల్, షమీతో పాటుగా దక్షిణాఫ్రికా సిరీసులో సత్తాచాటిన మొహ్మద్ సిరాజ్ కూడా ఆసీస్ విమానం ఎక్కనున్నాడని బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. ఈ ముగ్గురు పెర్త్‌లో సాధన పొందుతున్న భారత జట్టులో చేరనున్నారు.   టీ20 ప్రపంచకప్ 2022 కోసం జట్టును ప్రకటించే సమయానికి షమీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు ఫిట్‌నెస్ సాధించడం సానుకూలాంశం. 



Also Read: హర్భజన్ బౌలింగ్ యాక్షన్‌ను అచ్చు దించేసిన కోహ్లీ.. పడిపడి నవ్వుకున్న భజ్జీ, ఇర్ఫాన్!


Also Read: Team India Dance: డాన్స్ చేసిన భారత ప్లేయర్స్.. అబ్బా అనిపించిన ధావన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3P3R74U  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook