కామన్వెల్త్లో భారత్‌కు కాంస్యం.. యంగెస్ట్ వెయిట్ లిఫ్టర్ రికార్డ్..!
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. మొత్తం 295 కేజీలు ఎత్తి ఆయన ఈ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పటికే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, సంచిత చాను స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగా, పురుషుల విభాగంలో గురురాజ్ స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భారత్‌కు కాంస్యం దక్కడంతో భారత్ పతకాల పట్టికలో మొత్తం నాలుగు మెడల్స్ చేరాయి. చిత్రమేంటంటే.. కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పతకాన్ని గెలుచుకున్న యంగెస్ట్ వెయిట్ లిఫ్టర్ కూడా దీపక్ రావడం గమనార్హం. ఆ కుర్రాడి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. హర్యానా ప్రాంతానికి చెందిన దీపక్ తొలుత డైవర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తన కోచ్‌ల ఇచ్చిన స్ఫూర్తి మేరకు వెయిట్ లిఫ్టింగ్ విభాగం వైపు ఆసక్తి పెంచుకున్నారు.