‘క్రికెట్ అంటే పిచ్చి.. కానీ ఈ ఐపీఎల్ కష్టమే’
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఐపీఎల్ 2020 జరిగేలా కనిపించడం లేదట. ప్రేక్షకులు లేకున్నా క్రికెట్ ఆడేంత పిచ్చి ఉందన్నాడు క్రికెట్ సంచలనం.
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఐపీఎల్ 2020 జరిగేలా కనిపించడం లేదట. ఆస్ట్రేలియా వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అలెక్స్ క్యారీ ఐపీఎల్ నిర్వహణపై స్పందించాడు. గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రూ.2.4కోట్లకు క్యారీని దక్కిచుకుంది. PHotos: హెబ్బా.. అందాలు చూస్తే అబ్బా!
‘ఐపీఎల్‌కు తొలిసారి సెలక్ట్ అయ్యాను. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నాకు అవకాశం ఇచ్చింది. కానీ నా తొలి ఐపీఎల్‌కు కరోనా వైరస్ అడ్డంకిగా మారింది. ఐపీఎల్ ఆడితే చాల నేర్చుకునే అవకాశం దక్కేది. ఏది ఏమైతేనేం కరోనా వల్ల ఆటగాళ్లు రిఫ్రెష్ అవుతున్నారు. ఇదే తీరుగా పరిస్థితి కొనసాగి ట్వంటీ20 వరల్డ్ కప్ రద్దయితే మాత్రం చాలా నిరుత్సాహపడతానంటూ’ ఆసీస్ వికెట్ కీపర్ ఓ వీడియో సందేశాన్ని వదిలాడు. ఆమె అందాలకు నెటిజన్లు LockDown
గత ఆరు నెలలుగా ఆసీస్ అద్భుతమైన ట్వంటీ20 సిరీస్‌లు ఆడింది. ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ టీ20 వరల్డ్ కప్ జరగకపోతే మాత్రం చాలా కోల్పోయినట్లు ఉంటుంది. ప్రేక్షకులు కూడా మంచి వినోదాన్ని కోల్పోతారు. అదే సమయంలో క్రికెటర్లు, ప్రజల ప్రాణాలు ముఖ్యమే. ఓ క్రికెటర్‌గా ఆస్ట్రేలియా జట్టుకోసం ఏం చేయడానికైనా సిద్ధమే. ఇంగ్లాండ్ గడ్డమీద వరల్డ్ కప్ ఆడటం సరికొత్తగా ఉంటుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. పెళ్లి ఆగిందని వధువు ఆత్మహత్య
ప్రేక్షకులు లేకుండా ఆడటం కష్టంగా ఉంటుంది. కానీ క్రికెట్ మీద ఉన్న ప్రేమతోనైనా అలాంటి పరిస్థితుల్లో ఆడేందుకు తానెప్పుడూ సిద్ధమేనని అలెక్స్ క్యారీ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos