Delhi Capitals player Mitchell Marsh likely to miss IPL 2022: ఆదివారం బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో అద్భుత విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగలనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్ నోర్జే సేవలను కోల్పోయిన ఢిల్లీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌ సేవలను కూడా కోల్పోనుంది. ఐపీఎల్ 2022కి మార్ష్‌ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పాక్‌ పర్యటనలో మిచెల్ మార్ష్‌కు గాయమైనట్లు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మిచెల్ మార్ష్‌కు తొడ కండరాలు పట్టేసాయని ఆసీస్ కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ పేర్కొన్నాడు. మార్చి 29న లాహోర్‌లో పాకిస్థాన్‌తో జరగనున్న తొలి వన్డేకు మార్ష్‌ దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వన్డే సిరీస్ మొత్తానికి దూరం అతడు దూరం కానున్నాడని ఫించ్‌ తెలిపాడు. గాయం పెద్దదైతే అతను ఐపీఎల్ 2022 ఆడేది కూడా అనుమానమేనని సమాచారం తెలుస్తోంది. ఇదే జరిగితే ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బ తగలనుంది. 


ఐపీఎల్ 2022 వేలంలో మిచెల్ మార్ష్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాంచైజీ 6.5 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. మార్ష్‌ గతేడాది వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మార్ష్ ఆస్ట్రేలియా తరపున 32 టెస్టులు, 63 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. 21 ఐపీఎల్ మ్యాచులలో 225 రన్స్, 20 వికెట్లు పడగొట్టాడు. ఇక ఏప్రిల్‌ 2న గుజరాత్‌ టైటాన్స్‌తో ఢిల్లీ తలపడాల్సి ఉంది. 


Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్‌.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!


Also Read: Vijay-Puri: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ.. రేపే లాంచింగ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook