ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైన క్రికెటర్ ధోని..!
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు.
"నిషేధం వల్ల రెండేళ్లు సొంత జట్టుకి దూరమయ్యాను. ఈ క్రమంలో పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాను. ఇప్పడు మళ్లీ నా జట్టుకే ఆడుతున్నాను. ఇవి చాలా ఉద్వేగభరితమైన క్షణాలు. నాకు ఈ జట్టుతో ఉన్న బంధం చాలా ప్రత్యేకమైంది. టీమిండియా తరఫున 89 మ్యాచ్‌లు ఆడితే.. ఈ జట్టు తరఫున ఇప్పటికి 159 మ్యాచ్‌లు ఆడాను. మళ్లీ ఎల్లో జెర్సీ ధరించాల్సి రావడం నాకు సంతోషకరమైన విషయం" అని ధోని తెలిపాడు.
ప్రస్తుతం ధోని చేసిన ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 7వ తేది నుండి ఐపీఎల్ ప్రారంభమవుతుందన్న విషయం మనకు తెలిసిందే.
ఈ టోర్నిలో తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబయి ఇండియన్స్ లాంటి గట్టి ప్రత్యర్థితో తలపడనుంది. వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కి వేదిక కానుంది. రెండేళ్ళ నిషేధాన్ని ముగించుకుని ఈ సంవత్సరం చెన్నై సూపర్‌కింగ్స్, రాజస్థాన రాయల్స్ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగనున్నాయి. స్పాట్ ఫిక్సింగ్‌తో పాటు పలు ఇతర ఆరోపణలతో ఈ రెండు జట్లపై గతంలో సుప్రీం కోర్టు రెండేళ్లు బ్యాన్ విధించింది.
అయితే ఈ ఐపీఎల్‌లో 100 ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడిగా ధోనికున్న ఫాలోయింగ్.. మరి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు ఛాంపియన్ షిప్ తీసుకొచ్చి పెడుతుందో లేదో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే