ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్.. ధోనీదట!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఏది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఏది? అంటే.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో నాటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వాడిందట. సాధారణంగా క్రికెటర్లు గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్లు వేలానికి వస్తూ ఉంటాయి. అలానే ధోనీ బ్యాట్ కూడా వేలానికి వచ్చింది. ఆ వేలంలో అమ్ముడైన బ్యాట్లలో కెల్లా అత్యధిక ధర పలికింది ధోని బ్యాట్.
ఇంతకీ అది వేలంలో అమ్ముడైన ధర ఎంతంటే 10లక్షల పౌండ్లు (72 లక్షల రూపాయలు). 2011 ఏప్రిల్ రెండో తేదీన టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంక మీద నెగ్గిన సంగతి తెలిసిందే. నేటితో ఆ ఫిట్‌కు ఏడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి.
జట్టు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి అద్భుతంగా ఆడిన తీరు, విజయాన్ని సిక్స్‌తో ముగించడం.. ఇదంతా భారత్ క్రికెట్ చరిత్రలోని ఒక అపూర్వ ఘట్టం. టీమిండియా ప్రపంచ కప్‌ను గెలిచాక మూడు నెలల తర్వాత లండన్‌లో ఒక ఛారిటీ డిన్నర్‌ను ఏర్పాటుచేశారు.
ధోని ప్రపంచకప్ ఫైనల్లో వాడిన షాట్ బ్యాట్‌ను కూడా అక్కడ వేలానికి ఉంచారు. ఆ బ్యాట్ 72 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ముంబైకి చెందిన ఆర్కే గ్లోబల్ అనే సంస్థ ధోని బ్యాట్‌ని కొనుక్కుంది. వేలంలో వచ్చిన డబ్బును ధోని భార్య సాక్షి పేరిట ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థకు జమ చేశారు. వేలంలో అత్యంత ధర పలికినదిగా ధోని బ్యాటు అలా రికార్డుల్లోకి ఎక్కింది.