Boxer Dingko Singh Death News: భారత క్రీడా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ భారత బాక్సర్ డింగ్‌కో సింగ్ కన్నుమూశాడు. కాలేయ సంబంధిత క్యాన్సర్ సమస్యతో గత కొన్నేళ్లుగా పోరాడుతున్న మాజీ బాక్సర్ డింగ్‌కో సింగ్ గురువారం నాడు తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతి పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరెన్ రిజిజు సంతాపం ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన బాక్సర్ డింగ్‌కో సింగ్. 2017లో ఆయన లివర్ క్యాన్సర్ బారిన పడ్డాడు. చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ జనవరి 2020లో నిర్వహించారు. అనంతరం కొంతకాలానికి ఆయన కరోనా బారిన పడ్డాడు. అయితే కొద్దిరోజుల్లోనే కోవిడ్19 మహమ్మారిని జయించాడు. కానీ క్యాన్సర్‌తో పోరాడుతూ నేటి ఉదయం డింగ్‌కో సింగ్ (Dingko Singh Passes Away) తుదిశ్వాస విడిచాడు. 1998లో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన డింగ్‌కో సింగ్ భారత్‌లో మేటి బాక్సర్లలో ఒకరని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు (Union Minister Kiren Rijiju) కొనియాడారు. అనంతరం భారత్‌లో బాక్సింగ్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. మాజీ బాక్సర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Also Read: ICC WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్, Team Indiaలో ఆందోళన పెంచుతున్న కివీస్ రికార్డులు



బాక్సింగ్‌లో మేటి ప్రతిభ కనబరిచిన డింగ్‌కో సింగ్‌కు 1998లో అర్జున అవార్డు లభించింది. బాక్సింగ్ క్రీడకు చేసిన సేవలకు గుర్తింపుగా 2013లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. బాక్సార్లు మేరీ కోమ్ (Boxer Mary Kom), విజేందర్ సింగ్‌లు మేటి బాక్సర్ డింగ్‌కో సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో మందికి ఆయన జీవితం స్ఫూర్తి అని, ఆయన ప్రేరణను తాము కొనసాగిస్తామని ట్వీట్ చేశారు. మాజీ బాక్సర్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook