టీ20 క్రికెట్‌లో ఇక ధోని ఇన్నింగ్స్ ముగిసినట్లేనా.. అంటే అవుననే కొందరు సీనియర్ ఆటగాళ్ళ నుండి సమాధానం వినిపిస్తోంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ధోనిని టీ20 మ్యాచ్స్ నుండి తప్పించింది.  వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాతో జరగాల్సిన టీ20 మ్యాచ్స్ సందర్భంగా ప్రకటించిన భారత జట్లలో ధోని పేరు లేదు. వికెట్ కీపరుగా కూడా ఆ జట్లలో రిషబ్ పంత్ పేరే ఉంది. అయితే ఇలాంటి నిర్ణయం సెలక్షన్ కమిటీ తీసుకోవడం వల్ల వన్డే  వరల్డ్ కప్ ఆడాలని భావిస్తున్న ధోని కెరీర్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో చెప్పలేమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ అంశంపై కూడా ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ ఆరు టీ20ల్లో ఆడలేన్నంత మాత్రాన.. ధోని కెరీర్ ముగిసినట్లు కాదని తెలిపారు. అయితే తాము ఇప్పటి నుండే రెండో వికెట్ కీపర్ స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నాం కాబట్టి.. రిషబ్ పంత్‌ను మ్యాచ్‌ల్లో తీసుకుంటున్నామని తెలిపారు.  కాగా.. నవంబరు 21 నుండి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 3 టీ20లు, 4 టెస్టు మ్యాచ్‌లు, 3 వన్డేలు ఆడుతుంది. 


వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు వెళ్లే భారత్ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, షాబాజ్‌ నదీమ్‌, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్