Eden Gardens allows 75 per cent Crowd: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత కొంత కాలంగా క్రికెట్ మైదానాల్లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న చోట మాత్రం పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతిస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత దేశంలో కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. అక్కడి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వ‌దేశంలో ఈ నెలలో వెస్టిండీస్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. మాడు టీ20ల సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ల‌కు 75 శాతం ప్రేక్షకులను అనుమ‌తించేందుకు బెంగాల్ ప్ర‌భుత్వం అంగీకరించింది. దాంతో సుమారు 50 వేల మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చే అవకాశం ఉంది. అన్ని ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో జ‌రిగే క్రీడ‌ల‌కు 75 శాతం ప్రేక్షకుల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్లు సోమ‌వారం బెంగాల్ రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. 


గత ఏడాది నవంబర్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లపై మధ్య జరిగిన టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచుకు 70 శాతం మంది ప్రేక్షకులు స్టేడియంకు హాజరయ్యారు. భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విండీస్ మూడు వ‌న్డేలు, టీ20లు ఆడ‌నుంది. ఆహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 6న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఆపై  9, 11 తేదీల్లో అహ్మదాబాద్‌లోనే మరో రెండు వన్డేలు జరుగుతాయి. ఆపై  ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీ20 సిరీస్ జరగనుంది.


Also Read: Budget Speech: బడ్జెట్ ప్రసంగాల 'బాహుబలి' నిర్మలమ్మ.. ఈసారి ఎన్ని గంటలు ప్రసంగిస్తారో మరి!!


Also Read: Union Budget 2022 Live updates*: పార్లమెంట్​లో నిర్మలా సీతారామన్​ బడ్జెట్ ప్రసంగం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook