INDIA vs Pak: భారత్-పాక్ టీ20 మ్యాచ్‌పై ఆగని వివాదాలు.. కొనసాగుతున్న అరెస్ట్‌లు
India Pak T20 Match: టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో వివాదం మొదలైంది. పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.
IND vs PAK : ఇండియా- పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌పై దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. పాక్ విజయాన్ని ఆస్వాధిస్తు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వారిని.. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో పాక్ క్రికెట్ జట్టుకు అనుకూలంగా పోస్ట్ పెట్టిన వారికి కొంత మంది మద్దతుగా కూడా నిలిస్తున్నారు. ఆటలో వేరే జట్టుకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుందని వాదిస్తున్నారు.
ఎనిమిది మంది అరెస్ట్..
ఈ వివాదాల నేపథ్యంలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, వ్యాఖ్యలు చేసిన నలుగురిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లో ఓ ప్రైవేటు ఉపాద్యాయురాలిని కూడా అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ఆగ్రాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కావడం గమనార్హం. ఈ వివాదం కారణంగా ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ కూడా చేసింది. ఆ ముగురు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలు సంఘాలు డిమాండ్ చేశాయి. కశ్మీర్లో కూడా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే రాజస్థాన్‌లో అరెస్టయిన ప్రైవేటు టీచర్ నఫీసా అట్టారి వివాదం మలుపు తిరిగి.
Also read: T20 World Cup 2021: తొలి మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మేలే చేస్తోంది: గ్రేమ్ స్వాన్
Also read: Babar Azam about Ind vs Pak match result: ఇండియాపై పాక్ విజయంపై బాబర్ ఆజం ఏమన్నాడంటే..
ఇంతకి ఏమైందంటే..
మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించిన తర్వాత.. నఫీసా వాట్సాప్‌లో ఓ స్టేట్ పెట్టారు. ఆ స్టేటస్ చూసిన ఒకరు పాక్‌కు సపోర్ట్ చేస్తున్నారా? అని వాట్సాప్‌లోనే ప్రశ్నించగా.. అవునని అర్థం వచ్చేలా ఉన్న ఓ ఈ మోజీని సమాధానంగా పంపారు నఫీసా. దీనితో ఈ ఛాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనితో ఆమె పని చేస్తున్న స్కూలు యాజమాన్యం తనను తొలగించింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వివాదాలన్నింటి నేపథ్యంలో నఫీసా ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను పెట్టిన పోస్ట్‌పై వివరణ ఇచ్చారు.
వాట్సాప్‌లో తాను సరదాగా ఇచ్చిన సమాధానమన్నారు. అంత మాత్రానా తాను పాక్‌కు మద్దతు ఇస్తున్నట్లు కాదని.. వెల్లడించారు. అందరిలాగే తనకు భారత్ అంటే ప్రేమ ఉందని వివరించారు.
అయితే తాను వాట్సాప్‌లో పెట్టిన స్టేటస్, రిప్లై తప్పుగా ఉన్నాయని గ్రహించి వెంటనే వాటిని డిలీట్ చేశానని నఫీసా వివరణ ఇచ్చారు. ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించాలని కోరారు.
ఎవరి మనోభావాలు కించపరచడం తన ఉద్దేశం కాదని తెలిపారు. ఆమె వాదనతో ఏకీభవించిన కోర్టు బుధవారం సఫీసాకు బెయిల్ మంజూరు చేసింది.
Also read: IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!
Also read: Kohli Comments On Rohit Sharma: రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్ నుంచి తొలగించాలా?
రాజకీయంగా రగడ..
ఆగ్రాలో విద్యార్థుల అరెస్ట్, కశ్మీర్లో పాక్ మద్దతుదారులను అదుపులోకి తీసుకోవడంపై రాజకీయంగా రగట రాజుకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అరెస్టులను ఖండించారు. జమ్ము కశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఈ విషయమై ముఫ్తీపై విమర్శలు గుప్పించారు. ఆమెది తాలిబన్ మనస్థత్వమంటూ ఆరోపణలు చేశారు.
Also read: India Vs Pakistan: 'ఇది కదరా.. అసలైన హుందాతనం'.. ధోని, విరాట్ వీడియో వైరల్
Also read: IND vs PAK Match: ఇండియా పాక్ మ్యాచ్‌పై నెటిజన్ల స్పందన, అంపైర్‌పై మండిపాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook