Jonny Bairstow Run out Video: యాషెస్ సిరీస్‌లో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. చివరి రోజు 371 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 327 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ బెన్‌స్టోక్స్ (155) వీరోచితంగా పోరాడి జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్లను అడ్డుపెట్టుకుని బౌండరీలు, సిక్సర్లతో లక్ష్యానికి చేరువగా తీసుకువచ్చాడు. ఉత్కంఠభరిత సమయంలో స్టోక్స్ ఔట్ కావడంతో ఇంగ్లాండ్ 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. మిగిలిన మూడు టెస్టుల్లో ఒక మ్యాచ్‌ గెలిచినా యాషెస్ సిరీస్ ఆసీస్ సొంతమవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో రనౌట్ వివాదం దూమారం రేపుతోంది. ఇంగ్లాండ్ జట్టు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బెయిర్‌స్టో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికే క్రీజ్‌లో స్టోక్స్ పాతుకుపోయాడు. ఈ సమయంలో స్టోక్స్ సహకరిస్తూ.. వికెట్ కాపాడుకుంటే విజయం సాధ్యమని ఇంగ్లిష్ అభిమానులు అనుకున్నారు. అయితే 10 పరుగులు చేసిన బెయిర్ స్టో అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు.


కెమెరూన్ గ్రీన్ వేసిన బంతి బౌన్స్ అవ్వగా.. బెయిర్ స్టో కిందకువంగి తప్పించుకున్నాడు. బాల్ నేరుగా కీపర్ చేతిలో వెళ్లగా.. ఈలోపు బెయిర్ స్టో క్రీజ్‌ దాటి బయటకు వచ్చేశాడు. వికెట్ కీపర్ అలెక్స్ కారీ వెంటనే బాల్‌ను త్రో చేసి స్టంప్స్‌ను పడగొట్టాడు. దీంతో ఏం జరిగిందోనని బెయిర్ స్టో గందరగోళానికి గురవ్వగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఫీల్డ్ అంపైర్లు అహ్సన్ రజా, క్రిస్ గఫానీ టీవీ అంపైర్‌కు నివేదించారు. పలు రిప్లైలు పరిశీలించిన థర్డ్ అంపైర్.. బెయిర్ స్టోను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కీలక సమయంలో అనుకోకుండా ఔట్ అవ్వడంతో బెయిర్ స్టో నిరాశగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.


 




ఈ రనౌట్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. Spirit of Cricket ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని కొందరు అభిమానులు అంటుండగా.. గతంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఇలానే చేశారంటూ మరికొందరు వాదిస్తున్నారు. 2011లో     అప్పటి టీమిండియా ఎంఎస్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఇయాన్ బెల్‌పై రనౌట్ అవ్వగా.. అప్పీల్‌ను ఎంఎస్ ధోని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. 


2011లో నాటింగ్‌హామ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇయాన్ బెల్ 159 పరుగులు చేశాడు. టెస్ట్ 3వ రోజు టీ విరామానికి ముందు చివరి బంతికి ఇయాన్ మోర్గాన్ షాట్ ఆడగా.. బాల్ బౌండరీ లైన్ వద్దకు వెళ్లింది. ప్రవీణ్‌ కుమార్ వేగంగా పరిగెత్తి బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపి.. వికెట్ల వైపు త్రో చేశాడు. బాల్ బౌండరీ ​​చేరిందని భావించిన బెల్ మధ్యలోనే ఆగిపోయాడు. ఈలోపు ఫీల్డర్ బంతిని అందుకుని వికెట్లను పడగొట్టాడు. థర్డ్ అంపైర్ ఇవ్వగా.. తరువాత ధోని అప్పీల్‌ను వెనక్కి తీసుకోవడంతో బెల్ బ్యాటింగ్ కొనసాగించాడు. అప్పటి ధోని క్రీడాస్ఫూర్తిని అభిమానులు గుర్తు చేస్తున్నారు. 


 



Also Read: Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. 29 మంది ఎమ్మెల్యేలతో జంప్


Also Read: Maharashtra Politics: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన అజిత్ పవార్ ఆస్తుల విలువ ఎంతంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook