ENG vs IND 5th Test: టీమిండియాదే బ్యాటింగ్.. తెలుగు ఆటగాడికి చోటు! ఓపెనర్లు ఎవరంటే..
ENG vs IND 5th Test: England have won the toss and have opted to field vs India. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది.
ENG vs IND 5th Test Playing 11: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టులో తెలుగు ఆటగాడు హనుమ విహారి చోటు దక్కింది. మరో తెలుగు ప్లేయర్ కేస్ భరత్‌కు నిరాశే ఎదురైంది. శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత్ ఈ మ్యాచ్ కోసం నాలుగు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగుతోంది.
రోహిత్ శర్మ లేని కారణంగా.. ఓపెనర్‌గా చేతేశ్వర్ పూజారా ఆడనున్నాడు. మరో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతున్నాడు. హనుమ విహారి మూడో స్థానంలో ఆడనున్నాడు. ఐదులో శ్రేయాస్ అయ్యర్ ఆడుతాడు. ఈ మ్యాచ్‌కు భారత జట్టులోకి నలుగురు పేస్ బౌలర్లను తీసుకున్నాడు కెప్టెన్. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ స్పీడ్ బౌలింగ్ చేయనున్నారు. స్పిన్నర్‌గా జడేజా జట్టులో ఉండడంతో ఆర్ అశ్విన్ బెంచ్ కే పరిమితం అయ్యాడు.
గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఈరోజు (జూలై 1) నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ కారణంగా దూరం కాగా.. పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేపట్టాడు. 1987 తర్వాత భారత జట్టుకు సారథిగా నియమితుడైన పేస్ బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆ తర్వాత స్పిన్నర్ అనిల్ కుంబ్లే మినహా నాయకులంతా బ్యాటర్లే కావడం గమనార్హం.
తుది జట్లు:
ఇంగ్లండ్: అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జొ రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.
భారత్: శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్).
Also Read: బుమ్రా వార్త తెలియగానే.. మా అత్తగారు గాల్లో తేలిపోయారు: సంజనా గణేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.