Rohit Sharma Daughter: నాన్న రూమ్‌లో రెస్ట్ తీసుకుంటున్నాడు.. ఇంకా నెల రోజులు: సమైరా
Samaira gives update on Rohit Sharma`s Covid health. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి అతడి కుమార్తె సమైరా ఓ అప్‌డేట్ ఇచ్చింది.
Samaira gives update on Rohit Sharma's Covid health: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోహిత్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు హిట్‌మ్యాన్‌కు ఇలా జరగడం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. అయితే మ్యాచ్ ప్రారంభానికల్లా రోహిత్ కోలుకునే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. అయితే హిట్‌మ్యాన్ సిరీస్ డిసైడర్ మ్యాచ్ తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. రోహిత్ ఆరోగ్యం గురించి అతడి కుమార్తె సమైరా ఓ అప్‌డేట్ ఇచ్చింది.
రోహిత్ శర్మ ఐసోలేషన్‌లో ఉండటంతో అతడి సతీమణి రితికా, కుమార్తె సమైరా వేరే చోటుకు వెళ్లారు. ఈ క్రమంలో హోటల్ లాంజ్‌కు వారు వచ్చారు. వారిని గమనించిన అభిమానులు సమైరాను పలకరించారు. రోహిత్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లిష్‌లో ముద్దుముద్దుగా సమాధానాలు ఇచ్చింది. నాన్న ఎలా ఉన్నాడు అని అడుగగా.. 'డాడీ రూమ్‌లోనే ఉన్నాడు. కరోనా పాజిటివ్ కదా. కోలుకోవడానికి ఇంకా నెల రోజులు పడుతుంది' అని బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓపెనర్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో అతడి స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు స్టాండ్ బైగా మయాంక్ అగర్వాల్‌ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో ఐదవ టెస్టుకు దూరం కావడంతో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మయాంక్, గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. విరాట్ కోహ్లీ, చేటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, ఆర్ జడేజా మ్యాచ్ ఆడనున్నారు.
Also Read: KCR RAJBHAVAN: గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! రాజ్ భవన్ లో కేసీఆర్ సందడే సందడి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.