బౌలర్లకు మోర్గాన్ ఊచకోత ; ఆఫ్ఘాన్ ముందు కొండత లక్ష్యం
వరల్డ్ కప్ లో భాగంగా ఆప్ఘాన్ తో జరుగుతన్న మ్యాచ్ లో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది
ఆప్ఘాన్ బౌలర్ల పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా ఇంగ్లండ్ సారధి మోర్గాన్ ఊచకోత కోశాడు.ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 17 సిక్సర్లు బాదాడు. కేవలం 71 బంతుల్లో 148 పరుగుల చేశాడంటే ఏ స్థాయిలో మోర్గాన్ ఈ స్థాయిలో బాదాడో అర్థం చేసుకోవచ్చు. కాగా మెర్గాన్ మెరుపు ఇన్నింగ్ ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలుత నెమ్మెదిగా ఆడిన ఇంగ్లండ్ మోర్గాన్ క్రీజులో అడపెట్టగానే మ్యాచ్ స్వరూపం మారింది పోయింది. ఫలితంగా పసికూన అఫ్గాన్ ముందు కొండంత లక్ష్యం నిలిపింది. పసికూన ఆప్ఘాన్ 398 లక్ష్యాన్ని అందుకునేందకు ఎంత వరకు ప్రయత్నిస్తుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ జట్టు 10 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు పూర్తి చేసింది.