England vs India : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మనదే.. రెండో టీ20లో టీమిండియా సునాయాస విజయం..
England vs India 2nd T20 : ఇంగ్లాండ్-టీమిండియా జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. బ్యాట్‌తో జడేజా, బంతితో భువీ రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది.
England vs India 2nd T20: ఇంగ్లాండ్‌తో రెండో టీ20లోనూ భారత్ ఘనవిజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్‌తో జడేజా, బంతితో భువీ రాణించడంతో టీమిండియా సునాయాసంగా గెలుపొందింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు కేవలం 121 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రవీంద్ర జడేజా 5 ఫోర్లతో 46(29) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సులు, 3 ఫోర్లతో 31 పరుగులు, రిషబ్ పంత్ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. జడేజా ఆదుకోకపోయి ఉంటే టీమిండియా భారీ స్కోర్ సాధించకపోయి ఉండేది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు, రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లు పడగొట్టారు.
టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టును పేసర్ భువనేశ్వర్ ఆదిలోనే చావుదెబ్బ కొట్టాడు. ఇద్దరు ఓపెనర్లు జాసన్ రాయ్ (0), జోస్ బట్లర్ (4)ను వెంట వెంటనే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ ఇక పోటీ కనబర్చలేదు. మొయిన్ అలీ (35), డేవిడ్ విల్లే (33) మినహా మిగతా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. దీంతో ఆ జట్టు కేవలం 17 ఓవర్లలో కేవలం 121 పరుగులకే కుప్పకూలింది.
టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. జస్‌ప్రిత్ బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2 వికెట్లు, పాండ్యా, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. భువీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook