Marizanne Kapp becomes fastest player to score 150 in Womens Test Cricket: టాంటన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌ మహిళలతో జరుగుతోన్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మారిజాన్‌ కాప్‌ సూపర్ సెంచరీ చేసింది. 213 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 150 పరుగులు బాదింది. టెస్టు కెరీర్‌లో కాప్‌కు ఇదే తొలి టెస్టు సెం‍చరీ కావడం విశేషం. టాప్ ఆర్డర్ విఫలమయిన చోట ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. కాప్‌ సూపర్ సెంచరీ బాదడంతో ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌పై 150 పరుగులు చేయడంతో టెస్టుల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన మహిళా క్రికెటర్‌గా మారిజాన్‌ కాప్‌ నిలిచింది. అంతకుముందు 1961లో వైవోన్ వాన్ మెంట్జ్ ఇదే ఇంగ్లండ్‌పై 105 పరుగులు చేసింది. మహిళల టెస్టుల్లో ఆరు లేదా అంతకంటే దిగువ స్థానాల్లో బ్యాటింగ్‌ వచ్చి అత్యధిక స్కోర్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా కూడా కాప్ నిలిచింది. మహిళల టెస్టుల్లో వేగంగా 150 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. కాప్‌ 212 బంతుల్లో150 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ కరాన్‌ రోల్టాన్‌ 213 బంతుల్లో ఈ ఫీట్‌ అందుకుంది.


ఏకైక టెస్టు మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆండ్రీ స్టెయిన్ (8), వోల్వార్డ్ట్ (16), లారా గుడాల్ (10), లీ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కాప్‌ జట్టును అదుకుంది. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. బౌండరీలు బాదుతూ ఒంటిరి పోరాటం చేసింది. కాప్‌ పుణ్యమాని దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ బౌలర్లలో కేట్ క్రాస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. 


ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఓపెనర్ టామీ బ్యూమాంట్ పెవిలియన్ చేరింది. 61 బంతుల్లో 28 పరుగులు చేసిన బ్యూమాంట్.. ఎల్బీగా పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ ఎమ్మా లాంబ్ (37), కెప్టెన్ హీథర్ నైట్ (4) క్రీజులో ఉన్నారు. ఇంగ్లీష్ జట్టు 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 74 రన్స్ చేసింది. ఇంగ్లండ్ ఇంకా 210 పరుగులు వెనకబడి ఉంది.  


Also Read: Allu Arjun No.1 : సౌత్ లో దుమ్మురేపిన అల్లు అర్జున్.. అందరినీ వెనక్కు నెట్టి ముందుకు


Also Read: ఇంటర్‌లో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా.. టెన్షన్ అవసరం లేదు! ఇలా చేస్తే..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.