Neeraj Chopra Family: నీరజ్ చోప్రా కుటుంబ సభ్యుల సంబరాలు.. ప్రధాని మోదీ అభినందనలు (వీడియో)
Neeraj Chopra Family celebrations after he wins silver in World Athletics Championships. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పథకం సాదించగానే.. అతడి కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేశారు.
Family celebrates Neeraj Chopra win in World Athletics Championships: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2022లో సరికొత్త చరిత్రను లిఖించాడు. అమెరికా వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ ఈటెను 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన రెండో భారత అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డుల్లోకి ఎక్కాడు.
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పథకం సాదించగానే దేశవ్యాప్తంగా ప్రజలందరూ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నీరజ్ కుటుంబ సభ్యులు కూడా డాన్స్ చేసి తమ సంతోషాన్ని తెలిపారు. హర్యానా పానిపట్‌లోని అతని స్వగ్రామంలో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మీడియా ముందు డాన్స్ చేస్తూ ఆనందపడిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరోవైపు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పథకం గెలిచిన నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'మన అత్యున్నత అథ్లెట్స్‌లో ఒకరు అద్భుత విజయం సాధించారు. సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాకు అభినందనలు. భారత క్రీడలకు ఇది ప్రత్యేకమైన సందర్భం. చాంపియన్‌షిప్‌లో ఇంకా ఆడబోయే వారికి ఆల్ ది బెస్ట్' అని పేర్కొన్నారు. సాయ్ మీడియా ట్వీట్‌ను ప్రధాని రీట్వీట్ చేశారు.
నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేయగా.. రెండో ప్రయత్నంలో ఈటెను 82.39 మీటర్లు విసిరాడు. మూడో ప్రయత్నంలో 86.37 విసిరిన నీరజ్.. నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్లు విసిరి సిల్వర్ అందుకున్నాడు. దాంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు. 2003 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్ విభాగంలో అంజు బాబీ జార్జ్ కాంస్య పతాకాన్ని గెలిచారు. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి జావెలిన్ త్రోయర్‌గా నీరజ్ చరిత్రకెక్కాడు.
Also Read: ఇలాంటి సపోర్ట్ ఉంటే.. భారత్ క్రీడల్లో ఇంకా ముందుకు దూసుకుపోతుంది: నీరజ్ చోప్రా
Also Read: Corona Updates in India: దేశంలో ఫోర్త్ వేవ్ తప్పదా..కలవర పెడుతున్న రోజువారి కేసులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.