ఫుట్ బాల్ ప్రపంచకప్ సంగ్రామం ముగిసింది. ఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2018 టైటిల్ కైవసం చేసుకుంది. క్రొయేషియా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫిఫా ప్రపంచకప్ పోరులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన పలువరు ఆటగాళ్లకు అవార్డులు దక్కాయి. వారి వివరాలు..


  • వరల్డ్ కప్ ట్రోపీ- ఫ్రాన్స్

  • గోల్డెన్ బూట్ అవార్డ్- హ్యారీ కేన్ (ఇంగ్లాండ్-6 గోల్స్)

  • గోల్డెన్ గ్లోవ్స్ అవార్డ్- తిబాట్ కోర్షియాస్ (బెల్జియం)

  • ఫెయిర్ ప్లే అవార్డ్- స్పెయిన్

  • ఫిఫా గోల్డెన్ బాల్ అవార్డ్-మొడ్రిక్(క్రొయేషియా)

  • యంగ్ ప్లేయర్ అవార్డ్-క్యలియన్ ఎంబాపే(ఫ్రాన్స్)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్రాన్స్ జట్టుకు ప్రముఖుల అభినందనలు


ఫిఫా ప్రపంచకప్ విజేత ఫ్రాన్స్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్‌లో అద్భుతమైన ఆటతీరును కనబరిచారంటూ భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఆ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు కూడా ఫ్రాన్స్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అటు ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడం పట్ల రష్యాపై ప్రపంచానికి ఉన్న దృష్టికోణం మారిందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.



 



 


ఫిఫా వరల్డ్ కప్-2018 విజేత ఫ్రాన్స్


ఫుట్‌బాల్ వరల్డ్ కప్-2018 టైటిల్‌ను ఫ్రాన్స్ జట్టు సొంతం చేసుకుంది. క్రొయేషియాతో ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ ఘనవిజయం సాధించింది.19, 38, 60, 66వ నిమిషాల్లో ఫ్రాన్స్ జట్టు గోల్స్ నమోదు చేశారు. 20 ఏళ్ల తరువాత (1998 తరువాత) ప్రపంచకప్ గెలవడం ఫ్రాన్స్ జట్టుకు ఇదే తొలిసారి.


ఫిఫా ఫైనల్ సైడ్ లైన్స్


  • 1958 తర్వాత ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆరు గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి.

  • ప్రపంచకప్ ఫైనల్‌లో గోల్ చేసిన యువ ఆటగాడిగా పీలే తరువాత నిలిచిన ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే.

  • మూడు సార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన ఫ్రాన్స్ రెండుసార్లు విజేతగా నిలిచింది.

  • తొలిసారి ప్రపంచకప్ ఫైనల్ లో క్రొయేషియా రన్నరప్‌గా నిలిచింది.