ఫిఫా 2018: సెమీస్‌కు ఇంగ్లాండ్.. స్వీడన్ పై ఘనవిజయం
ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. క్వార్టర్ ఫైనల్స్‌లో స్వీడన్‌ను 2-0తో ఓడించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు.
ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. క్వార్టర్ ఫైనల్స్‌లో స్వీడన్‌ను 2-0తో ఓడించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. మ్యాచ్ తొలిదశ నుండీ ప్రత్యర్థికి దీటుగా బదులిస్తూ ఆడిన ఇంగ్లాండ్.. గోల్ కొట్టాలనే లక్ష్యంతోనే పోరాడింది. అలాగే స్వీడన్ కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్ల డిఫెన్స్ గేమ్‌ను చెల్లాచెదురు చేయడానికి ప్రయత్నిస్తూ.. ఎటాకింగ్ ఆడింది. కానీ.. వారి ఆశలను వమ్ము చేస్తూ ఇంగ్లాండ్ ప్లేయర్ ముగురై 30వ నిమిషంలో తనకు వచ్చిన అవకాశాన్ని గోల్‌గా మలిచి విజయభేరి మోగించాడు.
కార్నర్ కిక్ ద్వారా వచ్చిన ఒకే ఒక ఛాన్స్‌ను హెడర్‌గా మలచడంతో తన జట్టుకి విజయాన్ని సాధించాడు. తద్వారా తన జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. అయితే స్వీడన్ మాత్రం అలుపెరగని ధీరత్వాన్నే ప్రదర్శిస్తూ.. ఎలాగైనా గోల్ కొట్టి స్కోరు సమం చేయాలని ప్రయత్నించింది. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు వారిని కట్టడి చేసేశారు. ఏ మాత్రం బంతిని వారికి అందనివ్వకుండా ఆడారు. దాంతో తొలి అర్థభాగంలో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలిచింది.
కానీ రెండవ అర్థభాగంలో గేమ్ మరింత ఆసక్తిగా మారింది. ఇంగ్లాండ్ జోరుకు అడ్డుకట్ట వేయడానికి.. స్వీడన్ ఆటగాళ్లు పదే పదే ఎటాకింగ్ ఆడారు. పదే పదే గోల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇంగ్లాండ్ ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాడు డేలే తనకు పాస్ ద్వారా వచ్చిన హెడర్‌ను గోల్‌గా మలచడంలో విజయం సాధించడంతో తన జట్టుకి ఇక తిరుగే లేకుండా పోయింది. స్వీడన్ మాత్రం నిరుత్సాహంలో కూరుకుపోయింది. తర్వాత ఇరు జట్లు మరో గోల్ కొట్టడానికి చాలా ప్రయత్నించినా.. సమయం ముగిసిపోవడంతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచి సెమీస్‌కు దర్జాగా చేరుకుంది.