Yusuf Pathan in Lok Sabha elections 2024: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యూసుఫ్‌ పఠాన్‌ సార్వత్రిక ఎన్నికల(Lok Sabha elections 2024) బరిలో దిగబోతున్నాడు. పశ్చిమబెంగాల్‌లోని బెర్హమ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) టికెట్ పై అతడు పోటీ చేయనున్నాడు. రీసెంట్ గా టీఎంసీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పఠాన్‌ పేరు కూడా ఉంది. కాంగ్రెస్‌ అగ్రనాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరిపై యూసఫ్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో యూసుఫ్‌ సభ్యుడు. ఇదే కనుక నిజమైతే ప్రపంచ కప్ గెలిచిన జట్టు నుంచి పాలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మూడో క్రికెటర్ గా పఠాన్ నిలుస్తాడు. ఈ జాబితాలో గౌతం గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ ఇప్పటికే రాజకీయ ఆరంగ్రేటం చేశారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరుపున ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించాడు గౌతమ్ గంభీర్. ఆ తర్వాత స్టార్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరఫున 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు.  


Also Read: Durham vs Eagles: ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. గల్లీ క్రికెట్ కంటే దారుణం.. 16 రన్స్‌కే ఆలౌట్


మరోవైపు భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా స్టార్ పేసర్ మహ్మద్ షమీని కూడా ఎన్నికల ఆస్త్రంగా వాడాలని చూస్తోంది బీజేపీ. ఈ వార్తలు వాస్తవమైతే.. ఈసారి ఆటగాళ్లు మైదానంలో కాకుండా పొలిటికల్ గ్రౌండ్ లో ఆడబోతున్నారన్న మాట. 


Also Read: ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దూకుడు.. మూడు ఫార్మాట్‌లలో మనమే నంబర్ వన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter