Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది 'మెగా స్టార్ లీగ్ (MSL)' పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. పాక్ మాజీ క్రికెటర్లు ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర ఆటగాళ్లను కలుపుకుని లీగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ టోర్నీలో పాక్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, సినిమా, మ్యూజిక్ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొంటారని స్పష్టం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్‌ను స్టార్ చేయబోతున్నట్లు అఫ్రిది (Shahid Afridi) వెల్లడించాడు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రావల్పిండి వేదిగా మెగా స్టార్ లీగ్ (Mega Star League) ప్రారంభమవుతుందని ఆఫ్రిది ప్రకటించాడు. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయని తెలిపాడు. పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అనంతరం పాక్ సూపర్ లీగ్‌, బిగ్‌బాష్ లీగ్‌, శ్రీలంక ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్‌ల్లో ఆడాడు. 2008 ఐపీఎల్‌ లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 42 ఏళ్ల అఫ్రిది ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2022 ఎడిషన్‌లో చివరిగా ఆడాడు. 


Also Read: Harbhajan Singh: ఆల్‌టైమ్‌ ఐపీఎల్‌ జట్టును ప్రకటించిన భజ్జీ.. ఎవరెవరికి చోటు దక్కిందంటే..? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook