దక్షిణాఫ్రికా (South Africa) మాజీ క్రికెటర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అంతర్జాతీయ క్రికెటర్ అయిన వెర్నాండర్ ఫిలాండర్ (Vernon Philander) సోదరుడు టైరాన్ ఫిలిండార్ (32) కాల్చివేతకు గురయ్యాడు. ఓ గుర్తుతెలియని దుండగుడు జరిప్పిన కాల్పుల్లో క్రికెటర్ ఫిలాండర్ తమ్ముడు టైరాన్ ఫిలాండర్ (Tyron Philander Shot Dead) మృతి చెందాడు. వారి స్వస్థలం కేప్‌టౌన్‌లోనే బుధవారం ఈ విషాద ఘటన జరిగింది.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దక్షిణాఫ్రికా మీడియా కథనం ప్రకారం.. టైరాన్ ఫిలాండర్ తన ఇంటి సమీపంలో వాటర్ డెలివరీ చేస్తుండగా అకస్మాత్తుగా అతడిపై కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అతడి కుటుంబసభ్యులు యార్డు శుభ్రం చేస్తుండగా తుపాకీతో కాల్పులు జరిపినట్లు విన్నారు. అయితే నిందితుడు ఎవరన్నది తెలియరాలేదని మీడియా రిపోర్ట్ చేసింది.



తన సోదరుడు టైరాన్ ఫిలిండార్‌ హత్యపై వెర్నాన్ ఫిలాండ్ స్పందించాడు. ‘ నా సోదరుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. హత్య ఎందుకు చేశారో తెలియడం లేదు. ఆ కష్ట సమయంలో మా కుటుంబానికి కాస్త ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నాను. నా సోదరుడు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని’ ప్రార్థిస్తూ ట్వీట్ చేశాడు ఫిలాండర్. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సఫారీ పేసర్ ఫిలాండర్ రిటైర్మెంట్ ప్రకటించాడు.


Also Read : Prithvi Raj Yarra: సన్‌రైజర్స్ టీమ్‌లోకి పృథ్వీరాజ్.. ఎవరీ తెలుగు తేజం ?


 



 


Also read : Steve Smith: రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe