Ambati Rayudu Clarity On Political Entry: గత కొద్దిరోజులుగా రాజకీయాల్లో వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చారు. తాను పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పర్యటించిన అంబటి.. ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రజల నాడి తెలుసుకునేందుకు తాను గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణులు సమస్యలు, అవసరాలను తెలుసుకుంటున్నానని.. వీటిలో తాను ఏ పనులు చేయగలను.. వారి ఏ అవసరాలను తీర్చగలను అనే అంశాలను పరిశీలిస్తున్నానని చెప్పారు. అన్నింటిపై ఓ అవగాహనకు వచ్చిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని తెలిపారు. ప్రజాసేవకు ముందు అన్ని విషయాలను తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. అనంతరం వైసీపీ ప్రభుత్వం పరిపాలనను పొగుడుతూ కామెంట్స్, ట్వీట్లు హింట్ ఇచ్చాడు. లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే క్రికెట్ పిచ్‌పై బ్యాటింగ్‌తో దుమ్ములేపిన అంబటి.. ఇక నుంచి పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే అధికారికంగా వైసీపీ కండుకా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది.


ఇటీవల ఓ ఛానెల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఎక్కడో ఒక ఐటీ బిల్డింగ్ కడితే అభివృద్ధి కాదంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అప్పుడే అంబటి రాజకీయ ప్రవేశంపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈ మాజీ క్రికెటర్ కన్ఫర్మ్ చేసేశాడు. అసెంబ్లీ ఎన్నికలు అయితే.. పొన్నూరు లేదా గుంటూరు వెస్ట్ సెగ్మెంట్లలో ఏదో ఒక దానిని పోటీ చేసే ఛాన్స్ ఉంది. పార్లమెంట్ అయితే.. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 


ప్రస్తుతం మచిలీపట్నం నుంచి ఎంపీగా ఉన్న వి.బాలసౌరి.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో నిలిచే అవకాశం ఉంది. ఆయన పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే.. మచిలీపట్నం నుంచి ఎంపీగా అంబటి బరిలో ఉంటాడని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి మరి. 


Also Read: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాల స్వీకరణకు జూలై 05 వరకు గడువు..


Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి