మాస్కో: ఫిఫా ప్రపంచ కప్ 2018 ఫైనల్స్‌కు ఫ్రాన్స్ దూసుకెళ్లింది. కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్2లో ఫ్రాన్స్ బెల్జియం జట్టును 1-0తో ఓడించింది. సెయింట్ పీటర్ బర్గ్ వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్ ఫ్రాన్స్- బెల్జియం జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. 12 ఏళ్ల తరువాత ఫ్రాన్స్ ఫైనల్స్‌కు చేరడం ఇదే తొలిసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిఫా ప్రపంచ క‌ప్ సెమీ ఫైన‌ల్స్‌లో.. ఫైన‌ల్ బెర్తు కోసం పోటీపడ్డ ఫ్రాన్స్, బెల్జియం జట్లు హోరాహోరీగా పోరాడటంతో మ్యాచ్ ప్రారంభం నుంచి హాఫ్ టైమ్ వరకు ఒక్క గోల్ కూడా నమోదుకాలేదు. ఇరుజట్లు చక్కని డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఫ్రాన్స్‌ డిఫెండర్‌ శామ్యూల్‌ ఉమ్‌టిటి 51వ నిమిషంలో హెడర్‌ ద్వారా గోల్‌ చేసి జట్టును 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. చివర్లో బెల్జియం గోల్‌ కోసం ప్రయత్నించినా ఫ్రాన్స్‌ అడ్డుకుంది.


నేడు ఇంగ్లండ్‌, క్రొయేషియా తలపడే రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో ఆదివారం మాస్కోలోని లుహినికి స్టేడియంలో ఫ్రాన్స్‌ ఫైనల్‌ ఆడనుంది.