Warner vs Shaheen Afridi: క్రికెట్‌లో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. కొన్ని వివాదాలైతే..మరికొన్ని చమత్కారాలు. ఇంకొన్ని అద్భుతాలు. అదే జరిగింది పాకిస్తాన్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో. వార్నర్-అఫ్రిదిలు ఎదురెదురై దూసుకొచ్చేశారు. ఆ తరువాత ఏమైంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రికెట్ అంటేనే ఓ ఆసక్తికరం. అందుకు తగ్గట్టే పిచ్‌లో విభిన్న పరిణామాలు చోటుచేసుకుంటుంటాయి. క్రికెటర్లు ఒకరిపై మరొకరు మేనరిజం లేదా కామెంట్లతో వివాదం రేపుతుంటారు. మరికొన్ని సార్లు ఒకరికొకరు చమత్కరించుకుంటారు. లాహోర్‌లో జరుగుతున్న పాకిస్తాన్ ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ మ్యాచ్‌లో జరిగిన సన్నివేశం తొలుత ఆందోళన కల్గించింది. ఆ తరువాత నవ్వులు పూయించింది. డేవిడ్ వార్నర్ వర్సెస్ అఫ్రిది మధ్య జరిగిన సన్నివేశపు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



అసలేం జరిగింది..


పాకిస్తాన్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్, పాకిస్తాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది నువ్వా నేనా రీతిలో..సై అంటే సై అంటూ దూసుకొచ్చేశారు. ఇద్దరూ ఒకరి ఛాతీ మరొకరు టచ్ చేసే విధంగా ఎదురెదురయ్యారు. ఇదంతా చూస్తున్న తోటి ఆటగాళ్లు..ఎంపైర్, ప్రేక్షకులకు ఆందోళన రేగింది. ఏంటి..వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారనుకున్నారు. ఈ సీన్ చూస్తే ఎవరికైనా అలానే అన్పిస్తుంది కూడా. మీక్కూడా అలానే అన్పించింది కదా..కానీ అంతలోనే ఇద్దరి ముఖాల్లో నవ్వుల విరిశాయి..నవ్వుకుంటా పక్కకు తప్పుకున్నారు. ఆశ్చర్యంగా ఉందా..


అఫ్రిది వేసిన చివరి బంతిని వార్నర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అటు నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఖ్వాజా పరుగు తీసేందుకు ముందుకు రాగా..నో రన్ అంటూ వార్నర్ నిలువరించాడు. ఈలోగా అదే బంతిని అందుకునేందుకు వచ్చిన అఫ్రిది..హఠాత్తుగా వార్నర్‌పై దూసుకొచ్చేశాడు. చూస్తే..వార్నర్‌ను కొట్టేందుకే వెళ్తున్నాడా అన్పిస్తుంది. అటు వార్నర్ కూడా ఇది చూసి తగ్గేదేలే అనుకుంటూ..ముందుకెళ్లాడు. ఇద్దరూ ఒకరికొకరు సై అనేలా క్లోజ్ అయ్యారు. అ తరువాతి క్షణంలో నవ్వులు విరిశాయి.నవ్వుకుంటూ చెరోపక్కకు వెళ్లిపోయారు.ఇది చూసి మిగిలిన క్రికెటర్లు, కామెంటేటర్ల నవ్వాగలేదు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


లాహోర్‌లో జరుగుతున్న పాకిస్తాన్ ఆస్ట్రేలియా మూడవ టెస్ట్ మ్యచ్‌లో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. వార్నర్, ఖ్వాజా అడుతున్నారు. ఆస్ట్రేలియా..పాకిస్తాన్‌పై 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలవుట్ అయింది. 


Also read: IPL 2022: గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్ లకు స్టేడియం సీటింగ్ కెపాసిటీలో 25 % ప్రేక్షకులకు అనుమతి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook