న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్‌కి 15 ఏళ్లుగా సుపరిచితుడైన గౌతం గంభీర్ క్రికెట్‌కి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటికే నాలుగు రౌండ్లు పూర్తి కాగా గురువారం నాడు ప్రారంభం కానున్న 5వ రౌండ్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ, ఆంధ్రా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ గౌతం గంభీర్ చివరి మ్యాచ్ కానుందని తెలుస్తోంది. గౌతం గంభీర్ రిటైర్‌మెంట్ ప్రకటన అతడి అభిమానులకు షాక్‌ని ఇచ్చింది.


37 ఏళ్ల గౌతం గంభీర్ తన కెరీర్‌లో టీమిండియా తరపున మొత్తం 58 టెస్ట్ మ్యాచ్‌లు, 147 వన్డే ఇంటర్నేషనల్స్, 37 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 10,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లలో గౌతం గంభీర్ కూడా ఒకరు.