కోహ్లీ పాకిస్తాన్‌కి భయపడ్డాడు: తన్వీర్ అహ్మద్
ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం లేదన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ కెప్టెన్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడడం లేదన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇదే అంశంపై పాకిస్తాన్ కెప్టెన్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కోహ్లీ పారిపోయాడని ఆయన సెటైర్లు విసిరారు. అయితే తన్వీర్ వ్యాఖ్యలకు గౌతం గంభీర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘విరాట్ కోహ్లి దాదాపు 36 సెంచరీలు చేశాడు. కోహ్లి గురించి మాట్లాడే ఇతను.. టీమిండియా కెప్టెన్ సెంచరీలు చేసినన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు.
ఓ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో తన్వీర్‌తో పాటు గంభీర్ కూడా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో కోహ్లీ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు తన్వీర్ అహ్మద్. లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్‌ల్లో సైతం కోహ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడని.. అయినా టెస్టులలో బాగా రాణించాడని.. కానీ ఈ టోర్నిలో పాకిస్తాన్ తమతో రెండు, మూడు సార్లు ఆడుతుందన్న విషయం కోహ్లీని కలవరపెట్టి ఉండవచ్చని తన్వీర్ అన్నారు. ఆ కలవరం వల్లే ఆయన భయపడ్డాడని తెలిపాడు.
అయితే తన్వీర్ మాటలకు తన స్పందనను గంభీర్ తెలియజేశాడు. కోహ్లీ అనుభవం ముందు తన్వీర్ బలాదూర్ అన్న రీతిలో ఆయన కామెంట్స్ చేశారు. కాకపోతే.. ప్రస్తుతం గంభీర్‌కి, తన్వీర్‌కి మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తన్వీర్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని టీమిండియా యాజమాన్యం కోహ్లీని ఆసియా కప్ నుండి తప్పించి.. విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే.