Gautam Gambhir: భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ అధికారికంగా ప్రకటించింది. తమ ఫ్రాంచైజీ క్రికెటింగ్‌ ఆపరేషన్స్‌కు గ్లోబల్ మెంటార్‌గా ఎంపిక చేసింది. ప్రస్తుతం గంభీర్‌ ఐపీఎల్‌లో లక్నో జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు గ్లోబల్ మెంటార్‌గా నియమించారు. దీంతో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లోనూ పనిచేయనున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డర్బన్ సూపర్ జెయింట్స్‌కు మార్గనిర్దేశకుడిగా గౌతమ్ గంభీర్‌ వ్యవహరించనున్నాడు. టీమిండియా తరపున అతడు ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. భారత్‌కు టీ20 వరల్డ్ కప్‌తోపాటు వన్డే వరల్డ్ కప్‌ రావడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా దూకుడుగా ఆడుతూ ఎన్నో విజయాలను అందించాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌ భారత్‌కు రావడానికి ఎంతో కృషి చేశాడు. ఐపీఎల్‌లోనూ విశేషంగా రాణించాడు.


కోల్‌కతాను రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. గత సీజన్‌లో లక్నో జట్టు తరపు గంభీర్ పని చేశాడు. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడంతో కీలక పాత్ర పోషించాడు. ఈనేపథ్యంలోనే అతడికి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై గంభీర్ స్పందించాడు. పదవులు జట్టుకు సంబంధించి పెద్దగా పాత్ర పోషించవన్నాడు. టీమ్‌ సభ్యులకు మార్గనిర్దేశం చేసి విజయం వైపు నడిపించడమే తనకు ముఖ్యమన్నాడు. గ్లోబర్ మెంటార్‌గా ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు గంభీర్. 


సూపర్ జెయింట్ కుటుంబం తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశాడు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశాడు. 




Also read:Extramarital Affairs: సీరియల్ నటితో భర్త రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు భారీ వర్ష సూచన..ఆయా జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook