గౌతమ్‌ గంభీర్ తీరు సరిగా లేకపోవడం చేత అతడు భారత జట్టులో చోటు కోల్పోయాడని సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సందీప్‌ పాటిల్‌ అన్నాడు. 'గంభీర్‌ తీరు సరిగా లేకపోవడం చేత అప్పట్లో టీమిండియా జట్టు నుంచి అతడిని తప్పించాం. ఆ సమస్య రోజురోజుకీ పెరుగుతూ పోయింది. అతడిలో ఆవేశం ఎక్కువ’’ అని సందీప్‌ చెప్పాడు. గంభీర్‌ను జట్టు నుంచి తప్పించినప్పుడు సందీప్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. 2011లో ఇంగ్లాండ్‌ జట్టుతో సిరీస్‌లో బౌన్సర్‌ తగిలాక స్వదేశానికి తిరిగి రావడం గౌతమ్‌కు పెద్ద నష్టం కలిగించిందన్నాడు. గంభీర్‌, తాను 7-8 ఏళ్లపాటు  మంచి మిత్రులమని, జట్టు నుంచి తప్పించిన తర్వాత అతడు స్నేహాన్ని వదులుకున్నాడని పాటిల్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గంభీర్‌ ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతడికి తుది జట్టు చోటు దక్కలేదు. దీంతో గంభీర్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. నిజానికి గంభీర్‌ ఫైనల్ జట్టులో లేకపోవడానికి కారణం కెప్టెన్‌, యాజమాన్యం కాదట. స్వయంగా గంభీరే శుక్రవారం నాటి కోల్‌కతా మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడని కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ వెల్లడించాడు.