Gautam Gambhir wild celebration reactions goes viral after LSG beat KKR: ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం రాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్‌ (140 నాటౌట్‌; 70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (68; 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (50; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (40; 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఓడిపోతుందనుకున్న సమయంలో రింకూ సింగ్‌ సునామి ఇన్నింగ్స్ ఆడి రేసులోకి తెచ్చాడు. దాంతో చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 21 పరుగులు అవసరం అయ్యాయి. రింకు సింగ్ మొదటి నాలుగు బంతులకు 4, 6, 6, 2 కొట్టడంతో గెలుపు సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఇక కోల్‌కతా విజయం ఖాయమనుకున్నారు. చేతుల్లో ఉన్న మ్యాచ్‌ చేజారుతుండటంతో డగౌట్‌లో ఉన్న లక్నో మెంటర్ గౌతమ్ గంభీర్ చాలా అసహనానికి గురయ్యాడు. మార్కస్ స్టాయినిస్ వేసిన ప్రతి బంతికీ గంభీర్ చాలా టెన్షన్ పడ్డాడు. 


ఐదో బంతికి రింకూ సింగ్ క్యాచ్ ఔటైనా గౌతమ్ గంభీర్ స్పందించలేదు. అదే టెన్షన్ కొనసాగించాడు. గోళ్ళుకొరుకుంటూ చాలా నిరాశగా కనిపింఛాడు. ఇక చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో.. క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో ఒక్కసారిగా సీటులోంచి లేచిన గంభీర్ హద్దులు దాటి సంబరాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ సంబరాలు చేసుకున్నాడు. పక్కనే ఉన్న ఆటగాళ్లను గట్టిగా హత్తుకుంటూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. పక్కకు వచ్చి కూడా గట్టిగా అరిచాడు. ఈ సమయంలో అతడు చాలా ఆవేశంగా కనిపించాడు. 



ప్రస్తుతం గౌతమ్ గంభీర్ రియాక్షన్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గంభీర్ ఇలా సంబరాలు చేసుకోవడం చాలా అరుదు. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే గంభీర్.. కనీసం స్మైల్ ఇవ్వడం కూడా ఎవరూ చూసుండరు. అలాంటి గంభీర్ ఇలా సంబరాలు చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'గంభీర్‌ను ఇలా ఎప్పుడూ చూడలేదు', 'కోల్‌కతా జట్టుకి గతంలో కెప్టెన్‌.. ఇప్పుడేమో ఇలా' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 


Also Read: IPL 2022 Playoffs Scenario: ప్లే ఆఫ్స్‌ చేరిన గుజరాత్, లక్నో.. మిగతా రెండు స్థానాల కోసం ఐదు జట్ల మధ్య పోటీ!


Also Read: Puppy Bath Video: కుక్క పిల్లకి మొదటిసారి స్నానం..16 లక్షల మంది ఎందుకు చూసారో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook