German Open 2022: ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​ (Kidambi Srikanth) తన దూకుడు కొనసాగిస్తున్నాడు. జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, లండన్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ (Saina Nehwal) టోర్నీ నుంచి నిష్క్రమించి నిరాశ పరిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాజీ ప్రపంచ నంబర్ 1,  ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ రెండో రౌండ్ మ్యాచ్‌లో చైనాకు చెందిన లు గువాంగ్ జుపై 21-16 21-23 21-18 తేడాతో విజయం సాధించాడు. అతను తన తర్వాత మ్యాచ్ లో ఒలింపిక్ ఛాంపియన్, డెన్మార్క్‌కు చెందిన టాప్ సీడ్ విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడే అవకాశం ఉంది. 


2019 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఏడో సీడ్ సింధు (PV Sindhu), మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో చైనాకు చెందిన జాంగ్ యి మాన్‌ చేతిలో ఓడిపోయింది. 55 నిమిషాలు పాటు జరిగిన ఈ మ్యాచ్ లో 14-21 21-15 14-21 తేడాతో సింధు పరాజయం చవిచూసింది. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న సైనా.. ఎనిమిదో సీడ్ థాయ్ రాట్‌చానోక్ ఇంటానాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-21 15-21 తేడాతో ఓడిపోయింది.


Also Read: NZ vs IND: హర్మన్‌ప్రీత్‌ పోరాడినా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు తప్పని ఓటమి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.