Free Streaming: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కూడా జియో సినిమా బాటలోనే నడవనుంది. క్రికెట్ ప్రేమికులకు గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. ఐపీఎల్ టోర్నీ మొత్తం ఫ్రీ స్ట్రీమింగ్ చేయడం ద్వారా రికార్డు నెలకొల్పి జియో సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సైతం ఇదే బాట పడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెలీకం రంగంలో అంతా ఉచితం చేసి అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా మార్కెట్ క్యాప్చర్ చేసిన జియో..ఓటీటీలో కూడా సంచలనం రేపింది. ఐపీఎల్ 2023 టోర్నీ మొత్తం ఉచితంగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా జియో సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 45 కోట్లమంది వీక్షించడం కొత్త రికార్డు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను ఏకంగా 3 కోట్లమంది వీక్షించారు. ఐపీఎల్ మ్యాచ్‌లను గతంలో డిస్నీ హాట్‌స్టార్ కూడా ప్రసారం చేసినా సబ్‌స్క్రిప్షన్ పెట్టడంతో చాలామంది వెనక్కు తగ్గారు. ఎప్పటికప్పుడు స్కోర్ బోర్డ్ ద్వారా ఫాలో అయ్యేవారు. కానీ ఐపీఎల్ 16 జియో సినిమా ఉచిత స్ట్రీమింగ్ చేయడం ఓ సెన్సేషన్‌గా మారింది. 


ఐపీఎల్ ఉచిత స్ట్రీమింగ్‌తో జియో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడంతో డిస్నీ హాట్‌స్టార్ కూడా అదే పంథా అనుసరించబోతోంది. జియో ఎఫెక్ట్‌తో కోల్పోయిన వీక్షకుల్ని తిరిగి పొందేందుకు డిస్నీ హాట్‌స్టార్ సిద్ధమౌతోంది. అందుకే ఈసారి ఐసీసీ ప్రపంచకప్ , ఆసియా కప్ రెండు టోర్నీలనూ ఉచితంగా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉచితంగా స్ట్రీమ్ చేస్తోంది. ఇప్పటికే డిస్నీ హాట్‌స్టార్..జియో సినిమా దెబ్బకు చాలా నష్టపోయింది. ఇప్పుడు మరింత నష్టపోకుండా ఉండేందుకు, వీక్షకుల్ని తిరిగి పొందేందుకు ఐసీసీ ప్రపంచకప్, ఆసియా కప్ టోర్నీలను ఫ్రీ స్ట్రీమింగ్ చేయనుంది. 


సాధారణంగా క్రికెట్ అనగానే డిస్నీ హాట్‌స్టార్ ట్యూన్ చేయడం చాలామందికి అలవాటుగా ఉండేది. కానీ జియో సినిమా దెబ్బకు హాట్‌స్టార్ కొత్త వ్యూహాలు రచించాల్సి వస్తోంది. ఐసీసీ ప్రపంచకప్ 2023, ఆసియా కప్ 2023 ఉచిత స్ట్రీమింగ్ ద్వారా ఏ మేరకు వీక్షకుల్ని ఆకర్షించగలుగుతుందో వేచి చూడాలి. 


Also read: Ind vs Aus WTC Final Highlights: ఫైనల్ టెస్ట్‌లో ఆసీస్ జోరు.. తొలి రోజు రోహిత్ శర్మ చేసిన మూడు తప్పులు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook