Home Loan Interest Rates 2024: హోమ్ లోన్ తీసుకుంటున్నారా..! ఈ బ్యాంక్‌లో బంపర్ ఆఫర్.. భారీగా తగ్గిన వడ్డీ
Bank Of India Home Loan Interest Rates: హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. 8.౩ శాతంతో హోమ్ లోన్ అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.
Bank Of India Home Loan Interest Rates: హోమ్ లోన్ తీసుకుంటున్నావారికి బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం 8.45 శాతం ఉండగా.. 8.3 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇది లిమిటెడ్ ఆఫర్ అని.. మార్చి 31వ తేదీ వరకే ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ లిమిటెడ్ ఆఫర్‌లో ప్రాసెసింగ్ ఫీజులను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. హోమ్ లోన్స్‌తో పాటు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఫైనాన్సింగ్‌ను అందిస్తోంది. ఇందుకోసం 7 శాతం తగ్గిన వడ్డీ రేటుతో ఇస్తోంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండవు.
Also Read: Girl Pregnancy: పరీక్ష హాల్‌లో అడ్డం పడిన బాలిక.. ఆస్పత్రికి వెళ్తే గర్భవతి రూ.2 లక్షలకు ఖరీదు
30 ఏళ్ల టెన్యూర్ హోమ్ లోన్ 8.3 శాతం వడ్డీ రేటుతో ప్రారంభ ఈఎమ్ఐ లక్షకు రూ.755 వరకు ఉంటుంది. ఈ లోన్ ప్యాకేజీలో ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ గృహ కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ హోమ్ లోన్ ఆఫర్‌లో గృహ నిర్మాణం, పునర్నిర్మాణం, ఫర్నిచర్ మాత్రమే కాకుండా క్లీన్, పునరుత్పాదక ఇంధన సొల్యూషన్స్‌ను ప్రోత్సహించడానికి కూడా వర్తిస్తుంది. రూ.10 లక్షల వరకు హోమ్ లోన్స్‌కు అదే వడ్డీ రేటుతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు బీఓఐ ఆర్థిక సహాయం అందిస్తుంది.
రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ లోన్‌లు ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 7 శాతం వడ్డీతో అందిస్తోంది. ఈ స్కీమ్ కింద సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి అత్యధికంగా 120 నెలల రీపేమెంట్ వ్యవధితో ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతం వరకు ఫైనాన్స్ పొందవచ్చు. రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఈ సబ్సిడీ అమౌంట్‌ను నేరుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్‌లను ఎక్కువ మంది ఏర్పాటు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది.
8.3 శాతం వడ్డీ ఆఫర్ ఈ నెలాఖరు వరకు మాత్రమే అమలులో ఉంటుంది. అప్పటివరకు ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయదు. 8.3 శాతం వడ్డీ రేటు ప్రస్తుతం అన్ని బ్యాంకుల్లో కంటే తక్కువ అని బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకుల్లో కనీస రేటు 8.4 శాతంగా ఉందని తెలిపింది. కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter