CSK captain MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అభిమానులకు శుభవార్త. నిన్న ఎంఎస్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అభిమానులకు ఓ కీలక అంశంపై స్పష్టత లభించింది. తాజా వేలంలోనూ ధోనీని సీఎస్కే వదులుకునే ప్రసక్తే లేదని తేలిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021)లో మరో రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ కు సారథి ఎంఎస్ ధోనీనే అని ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఐఏఎన్‌ఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎస్ ధోనీ (MS Dhoni) మరో ఏడాది లేదా రెండేళ్లపాటు సీఎస్కే ఫ్రాంచైజీతోనే కొనసాగుతాడు. ధోనీ ఇప్పటికీ ఫిట్‌నెస్‌గానే ఉన్నాడు. రెగ్యూలర్‌గా శిక్షణ తీసుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో ఏ కారణంతో ధోనీని అడ్డుకోగలం అంటూ సీఎస్కే సారథి ధోనీ ఐపీఎల్ కెరీర్‌పై క్లారిటీ ఇచ్చేశాడు. మీరు ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ కెప్టెన్‌గా ఈ ఐపీఎల్ 2021లోనూ ధోనీ సత్తా చాటిన విషయాన్ని గమనించాలని గుర్తుచేశారు. ఐపీఎల్‌లో విలువైన ఆటగాడిగా నిలిచి సీఎస్కే జట్టును కీలక స్థానంలో నిలిపాడని ధోనీపై ప్రశంసలు కురిపించారు.


Also Read: Wimbledon 2021: వింబుల్డన్‌లో స్విట్జర్లాండ్ దిగ్గజం Roger Federer కథ ముగిసింది


ఫినిషర్‌గా సీఎస్కేకు పలు మ్యాచ్‌లలో ధోనీ విజయాలు అందించాడు. 40 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినా రాణించే ఆటగాడిని తప్పించటం సరైన నిర్ణయం కాదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కరోనా కేసులు రావడంతో వాయిదా పడిన ఐపీఎల్ 14 సీజన్లోనూ 7 మ్యాచ్‌లకుగానూ చెన్నై జట్టు 5 విజయాలతో రెండో స్థానంలో ఉండటం గమనార్హం. ధోనీ బ్యాట్‌తో రాణించకపోయినా, తన కెప్టెన్సీ నైపుణ్యంతో IPL 2021లో సీఎస్కేను ముందుండి నడిపించాడని అభిమానులు, ఫ్రాంచైజీ విశ్వసిస్తున్నారు. 


Also Read: Ben Stokes: ఇయాన్ మోర్గాన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదన్న బెన్ స్టోక్స్


బ్యాటింగ్‌లో 7 మ్యాచ్‌లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ అవకాశం రాగా ఓసారి నాటౌట్‌గా నిలిచాడు. 30 బంతులు ఎదుర్కొన్న ధోనీ 12.33 సగటుతో పరుగులు సాధించాడు. దీపక్ చాహర్ స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడానికి ధోనీ మాస్టర్ మైండ్ కారణం. నిలకడగా ఆడే మొయిన్ అలీ భారీ షాట్లు ఆడటం, రుతురాజ్ గైక్వాడ్‌ను ఆరంభంలో ఎదురుదాడి చేసేలా ధోనీ తీర్చిదిద్దాడు. సారథ్య నైపుణ్యంతో మరో రెండేళ్లపాటు సీఎస్కే‌తో కొనసాగి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.


Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ బర్త్‌డే, టీమిండియా మాజీ కెప్టెన్‌కు శుభాకాంక్షల వెల్లువ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook