Gujarat Titans Vs Chennai Super Kings Playing XI Dream11 Team Tips: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర సమరం జరగనుంది. ప్లే ఆఫ్స్‌ రేసు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. గుజరాత్ ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. ఆరు విజయాలు, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ కూడా 11 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొందాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఇతర జట్ల సమీకరణాల మీద ఆధారపడి ఉంటుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Weather Report: తెలంగాణ వాసుల‌కు శుభ‌వార్త చెప్పిన వాతావ‌ర‌ణ శాఖ‌.. మ‌రో మూడు రోజులు పాటు వాన‌లు..


హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే..  గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. చెరో మూడు మ్యాచ్‌ల్లో గెలుపొంది సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఈ సీజన్‌లో తలపడిన ఒక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ పోటీగా ఉంది. కొన్ని మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ హవా నడిచినా.. మరికొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌కు, బంతికి మధ్య గట్టి పోటీ ఉండనుంది. అహ్మదాబాద్‌లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం లేదు. తేమ దాదాపు 45 శాతం ఉంటుంది. ప్రస్తుతం ఫామ్‌ను చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం అంత తేలిక కాదు. గుగూల్ ప్రాపబులిటీ ప్రకారం చెన్నై విజయ శాతం 57 ఉండగా.. గుజరాత్‌కు గెలుపు అవకాశాలు 43 శాతం ఉన్నాయి.


తుది జట్లు ఇలా.. (అంచనా)


గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, మానవ్ సుతార్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, నూర్ అహ్మద్, సందీప్ వారియర్


చెన్నై సూపర్ కింగ్స్: అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, శివమ్ దుబే, సమీర్ రిజ్వీ, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే.


GT Vs CSK Dream11 Prediction:


==> వికెట్ కీపర్లు: వృద్ధిమాన్ సాహా
==> బ్యాటర్లు: శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే
==> ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్)
==> బౌలర్లు: రషీద్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆర్.సాయి కిషోర్, తుషార్ దేశ్‌పాండే


Also Read: Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter