Sachin - Gill: సేమ్ టూ సేమ్.. 2009లో సచిన్, 2022లో గిల్! ఐపీఎల్‌లో ఈ ఇద్దరు మాత్రమే..
Shubman Gill innings is similar to Sachin Tendulkar in IPL. ఐపీఎల్ 2022లో భాగంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లానే ఇన్నింగ్స్‌ను తాజాగా శుభ్‌మన్ గిల్ ఆడి వార్తల్లో నిలిచాడు.
GT vs LSG, IPL 2022, Shubman Gill innings is similar to Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను తాను చిన్నప్పటినుంచి చూస్తూ పెరిగానని, క్రికెట్ ఆడడానికి అతడే తనకు స్ఫూర్తి అని టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే అతడు ఆరాధించే సచిన్ లాంటి ఇన్నింగ్స్‌ను తాజాగా గిల్ ఆడి వార్తల్లో నిలిచాడు. 2009 ఐపీఎల్ సీజన్లో 20 ఓవర్ల పాటు క్రీజులో ఉండి ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా బ్యాటింగ్ చేసిన తొలి ఆటగాడు సచిన్ అయితే.. తాజాగా అదే ఫీట్‌ను గిల్ అందుకుని రెండో ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
సచిన్ టెండూల్కర్ తన ఐపీఎల్ కెరీర్ మొత్తం ముంబై ఇండియన్స్ జట్టు తరఫునే ఆడిన విషయం తెలిసిందే. 2009 ఐపీఎల్ సీజన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 20 ఓవర్లు ఆడిన సచిన్.. 49 బంతుల్లో 59 పరుగులు చేశాడు. సచిన్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు బాదినా.. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. ఐపీఎల్ 2022లో భాగంగా మే 10న లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 20 ఓవర్లు ఆడి 49 బంతుల్లో 63 పరుగులు చేశాడు. సచిన్ లాగే 7 ఫోర్లు బాదిన గిల్.. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు.
2009లో సచిన్ టెండూల్కర్ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలవగా.. 2022లో శుభ్‌మాన్ గిల్ కూడా హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. అప్పటి మ్యాచ్‌లో ఏకైక హాఫ్ సెంచరీ సచిన్‌దే కాగా.. ఇప్పుడు కూడా గిల్‌దే కావడం విశేషం. ఆ మ్యాచులో సచిన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకోగా.. ఈ మ్యాచులో కూడా గిల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. ఇక అప్పుడు ముంబై, ఇప్పుడు గుజరాత్ కూడా గెలవడం విశేషం. మొత్తంగా ఐపీఎల్‌లో సచిన్, గిల్ మాత్రమే 20 ఓవర్లు పాటు క్రీజులో నిలబడి ఒక్క సిక్స్ కూడా బాధలేదు. 'అప్పుడు గురువు, ఇప్పుడు శిష్యుడు', 'గురుశిష్యులు సేమ్ టూ సేమ్' అంటూ ఫాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు శుభ్‌మన్ గిల్‌ను కేకేఆర్ రిటెన్షన్ చేసుకోలేదు. గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. టీ20ల్లో కాస్త నెమ్మదిగా ఆడుతాడనే అపవాదును సీజన్‌తో చెరిపేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2022లో 12 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 384 పరుగులు చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, గిల్ మధ్య లవ్‌స్టోరీ నడుస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Bill Gates Covid 19: బిల్ గేట్స్‌కు కరోనా.. ఐసోలేషన్‌లో సాఫ్ట్‌వేర్ దిగ్గజం!
Also Read: Upasana Konidela Covid 19: ఉపాసన కొణిదెలకు కరోనా.. విశ్రాంతి తీసుకుంటూనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.