GT vs LSG: ఐపీఎల్ 2022లో గ్రాండ్ విక్టరీతో గుజరాత్ ఎంట్రీ అదిరింది కదా..
GT vs LSG: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో అదరగొట్టింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
GT vs LSG: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో అదరగొట్టింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ఐపీఎల్ 2022లో కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మద్య జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ టైటాన్స్ తొలి విజయం దక్కించుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మొహమ్మద్ షమీ నిప్పులు చెరగడంతో..లక్నో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. కేఎల్ రాహుల్, డికాక్‌లు తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరిగారు. మొహమ్మద్ షమీ అద్భుత స్పెల్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ చేతులెత్తేసింది. షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి..3 వికెట్లు పడగొట్టాడు.
దీపక్ హుడా, బదోనీలు నిలదొక్కుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్ విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి...ఛేదించింది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్ 2022లో తొలి విజయంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
Also read: GT vs LSG: లక్నోను షమీ దెబ్బకొట్టినా.. ఆదుకున్న దీపక్ హుడా, ఆయుష్ బదోని! గుజరాత్ లక్ష్యం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook