Hardik Pandya to Mumbai Indians: క్రికెట్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే.. హార్ధిక్ పాండ్యాదే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యా మళ్లీ సొంతగూటికి ఎందుకు వెళ్లిపోయాడని అందరిలోనూ ఓ ప్రశ్నగా మారింది. ఆర్థిక వ్యవహారాలే కారణం అని ఊహగానాలు కూడా వినిపించాయి. ఒకసారి ఛాంపియన్‌గా.. మరోసారి రన్నరప్‌గా నిలిపిన కెప్టెన్‌ను గుజరాత్ అంత ఈజీగా ఎలా వదులుకుందని చాలామంది అడుగుతున్నారు. ఈ విషయంపై రకరకాల వార్తలు ప్రచారం జరుగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి క్లారిటీ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"గుజరాత్ టైటాన్స్ తొలి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా రెండు అద్భుతమైన సీజన్‌లను అందించడంలో జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఒకసారి ఛాంపియన్‌గా.. మరోసారి ఫైనల్‌కు చేర్చాడు. అయితే తాను తిరిగి ముంబై ఇండియన్స్‌కు ఆడాలని అనుకుంటున్నట్లు పాండ్యాతో మాతో చెప్పాడు. మేము అతని నిర్ణయాన్ని గౌరవిస్తాం. భవిష్యత్‌ పాండ్యా ఇంకా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం.." అని ఆయన తెలిపారు. పాండ్యా ముంబై జట్టుకు మారిపోవడంతో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది గుజరాత్ టైటాన్స్. కేన్ విలియమ్సన్‌కు ఇస్తారని ప్రచారం జరిగినా.. యంగ్ ఓపెనర్‌పైనే గుజరాత్ యజమాన్యం నమ్మకం ఉంచింది.


2015 నుంచి 2021 వరకు కాలంలో ముంబై ఇండియన్స్‌కు జట్టుకు పాండ్యా ప్రాతినిధ్యం వహించాడు. ముంబై జట్టు రిలీజ్ చేయగా.. రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌ తీసుకుంది. 2022లో అరంగేట్రం సీజన్‌లో టైటిల్‌ అందించాడు. గత ఏడాది ఫైనల్‌కు చేర్చగా.. చెన్నై చేతిలో ఓటమిపాలైంది. పాండ్యా తమతో చేరడంతో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను ముంబై వదులుకుంది. గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రెడ్ చేసింది.


మరోవైపు హార్థిక్‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం పట్ల ముంబై ఇండియన్స్ హర్షం వ్యక్తం చేసింది. జట్టు ప్రతినిధి నీతా అంబానీ మాట్లాడుతూ.. పాండ్యాను తిరిగి తమ టీమ్‌లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి తమ టీమ్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూసేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. హార్ధిక్‌ తిరిగి ముంబై ఇండియన్స్‌లో చూడటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. పాండ్యా ఏ జట్టుకు ఆడినా.. గొప్ప బ్యాలెన్స్‌ను అందిస్తాడపని అన్నారు. పాండ్యా మరిన్ని విజయాలు అందజేస్తాడని మేము ఆశిస్తున్నామన్నారు. 


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook