తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం
తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం
విండీస్ తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా.. గౌహతి వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా విండీస్ బ్యాటింగ్‌కు దిగింది. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది.
అనంతరం భారత్ 323 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు క్రీజులోకి దిగారు. ఆదిలోనే ధావన్ 4 పరుగులకే( 6బంతులు, ఒక ఫోర్) ఒషానే థామస్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (140; 107 బంతుల్లో 21×4, 2×6).. రోహిత్ శర్మ (152 నాటౌట్; 117 బంతుల్లో 15×4, 8×6)తో కలిసి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
కొహ్లీ, రోహిత్ శర్మలు శతకాలు చేయడంతో టీమిండియా 47 బంతులుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. రెండో వన్డే బుధవారం వైజాగ్‌లో జరుగుతుంది.