Hanuma Vihari Instagram Post: టీమిండియా టెస్టు ప్లేయర్ హనుమా విహారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆంధ్రా టీమ్‌ కెప్టెన్సీకి తాను ఎందుకు రాజీనాయా చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఒక రాజకీయ నేత తన రాజీనామాకు కారణమంటూ బాంబ్ పేల్చాడు. అతనే అసోసియేషన్‌కు చెప్పించి రాజీనామా చేయించాడని.. ఇకపై ఆంధ్రా టీమ్‌కు ఆడనని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్న హనుమా విహారి టీమిండియాలో రీఎంట్రీ కోసం శ్రమిస్తున్నాడు. యూపీ చేతిలో ఆంధ్రా టీమ్ ఓడిపోయిన తరువాత సంచలన పోస్ట్ పెట్టాడు. బ్యాటింగ్ మీద దృష్టిపెట్టేందుకో.. మరో కారణంగానో తాను కెప్టెన్సీకి రాజీనామా చేయలేదుని చెప్పుకొచ్చాడు. తాము చివరి వరకు కష్ట పడ్డామని.. కానీ ఓడిపోయామన్నాడు. తాను ఈ పోస్టును కొన్ని వాస్తవాలను తెలియజేసేందుకు పెడుతున్నానని పేర్కొన్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తాము మొదటి బ్యాచ్ బెంగాల్‌తో ఆడినప్పుడు కెప్టెన్‌గా ఉన్నానని.. ఆ టైమ్‌లో 17వ ప్లేయర్ పై అరిచానని చెప్పాడు విహారి. అయితే ఆ ఆటగాడు తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో తనపై ఫిర్యాదు చేశాడు. ఆయన తనపై యాక్షన్ తీసుకోవాలని అసోసియేషన్‌కు చెప్పారని.. దీంతో వెంటనే కెప్టెన్సీకి రాజీనామా చేయాలని తనకు ఆదేశాలు వచ్చాయన్నారు. గతేడాది ఫైనలిస్టు బెంగాల్‌పై తాము 410 పరుగులు చేశామని.. తన వైపు ఎలాంటి తప్పు లేకున్నా రాజీనామా చేయమని అడిగారని తెలిపాడు. నిజానికి ఆ ప్లేయర్‌ను తాను వ్యక్తిగతంగా ఎలాంటి అనలేదన్నాడు.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ ప్రకటన ఎప్పుడంటే..?  


ఆంధ్రా జట్టును గత ఏడేళ్లలో ఐదుసార్లు నాకౌట్‌కు తీసుకువెళ్లా.. 16 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడా.. ఆటకే అంకితమైన ఆటగాడు (విహారి) కంటే ఆ 17వ ప్లేయర్ వాళ్లకు ముఖ్యమైనవాడిగా కనిపించాడు. కెప్టెన్సీకి రాజీనామా చేయమని చెప్పడం నాకు చాలా అవమానంగా అనిపించింది. అయినా ఈరోజు వరకు ఆడుతున్నానంటే ఆటపై, జట్టుపై ఉన్న గౌవరమే.. నేను అవమాన పడినా ఇప్పటివరకు ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు.


 





ఇక నేను ఓ కీలక నిర్ణయం తీసుకున్నా. నా గౌరవం పోయిన ఆంధ్రా జట్టు కోసం ఇక నుంచి ఆడాలని అనుకోవట్లేదు. జట్టు అంటే చాలా ప్రేమ అని.. ప్రతీ సీజన్‌కు డెవలప్‌ అవుతున్న తీరు కూడా నాకు ఇష్టం. కానీ అసోసియేషన్ మమ్మల్ని ఎదగనివ్వడం లేదు.." అంటూ హనుమా విహారి పోస్టులో రాసుకొచ్చాడు.


Also Read: KTR Gifts: విద్యార్థులకు కేటీఆర్‌ 'అమూల్యమైన కానుక'.. చిన్నదే అయినా ఎంతో ప్రత్యేకం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి