Harbhajan Singh slams BCCI: ఇటీవల క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్​ సింగ్​ (Harbhajan singh) మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  బీసీసీఐ, ధోనీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని (MS Dhoni) తనకు మంచి మిత్రుడు అని..అతనితో ఎలాంటి విభేదాలు లేవని భజ్జీ చెప్పుకొచ్చాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో బీసీసీఐ (BCCI) నుంచి తగిన మద్దతు లభించలేదని...జట్టు నుంచి అకారణంగా తప్పించారని భజ్జీ వాపోయాడు. ఈ విషయమై ధోనీని అడిగితే అతడు ఏమీ సమాధానం చెప్పలేదని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయేమోనని అప్పట్లో ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై హర్భజన్ వివరణ ఇచ్చాడు. 


''2012 తర్వాత చాలా విషయాల్లో మార్పు వచ్చిందని..సెహ్వాగ్​, యువరాజ్​, గంభీర్​ ఐపీఎల్​లో ఆడటం వల్ల ఆ సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు పలికి ఉండవచ్చు. 2011 ప్రపంచకప్​లో​ విజేతగా నిలిచిన టీమ్​ఇండియా జట్టు.. ఆ తర్వాత ​మళ్లీ కలిసి ఎందుకు ఆడలేదు?'' అని ఈ సందర్భంగా భజ్జీ ప్రశ్నించాడు. 1998లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన హర్భజన్...టెస్టుల్లో 400కు పైగా వికెట్లు పడగొట్టాడు.


Also Read: IND vs WI: ఇంగ్లండ్‌ను ఓడించాం.. తర్వాత టీమిండియానే! విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook