Hardik Pandya Divorce: బిగ్ బ్రేకింగ్.. నటాషాతో విడాకులు తీసుకున్న హార్దిక్ పాండ్యా
Hardik Pandya Marriage Breaks With Natasa Stankovic: టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు.
Hardik Natasa Divorce: పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టుకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన అగ్ర శ్రేణి ఆటగాడు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశం చేశాడు. తాను ప్రేమించి డేటింగ్ చేసి.. పెళ్లి చేసుకున్న భార్య నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ విడిపోయాడు. ఇక ఎవరి దారులు వారివేనని ప్రకటనలో తెలిపాడు. అయితే విడాకులు పొందినా కూడా కుమారుడు అగస్త్య హార్దిక్‌తోనే ఉండనున్నట్టు తెలుస్తోంది. విడాకులు తీసుకున్న నటాషా కొన్ని రోజుల కిందట సెర్బియాకు వెళ్లిపోయింది.
Also Read: India vs Zimbabwe: మూడో విజయంతో భారత సంచలన రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్|
'నాలుగేళ్లుగా కలిసి ఉన్న అనంతరం నటాషా, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కలిసి జీవించేందుకు చాలా ప్రయత్నించాం. కానీ మా ఇద్దరికి ఇది కఠిన నిర్ణయమే అయినా ఇది మాకు మేలు చేస్తుందని నమ్ముతున్నాం. మేము కలిసి ఆనందించిన సమయం, పరస్పర గౌరవం, ఒక కుటుంబంగా ఎదిగాం. ఈ ప్రయాణాన్ని మేం ఆనందించాం. మా అబ్బాయి అగస్త్యకు అండగా ఉంటాం. వాడిని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ అండగా ఉంటాలని కోరుకుంటున్నా' అని పాండ్యా, నటాషా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
Also Read: Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. అతడి క్రికెట్ విశేషాలు తెలుసా?
క్రికెట్‌పరంగాను.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన హార్దిక్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కీలక పాత్ర పోషించాడు. జట్టు ట్రోఫీ సాధించడంలో హార్దిక్ పాత్ర మరువలేనిది. ఐపీఎల్‌లో ఆటపరంగా శ్రద్ధ కనబర్చకపోవడానికి కారణం విడాకుల గొడవనే కారణంగా గెలిసింది.
నటాషా ఎవరు?
సెర్బియా దేశానికి చెందిన మోడల్ నటాషా స్టాంకోవిక్‌తో హార్దిక్ ప్రేమ వ్యవహారాలు నడిపించాడు. అనంతరం వీరిద్దరూ కలిసి రెండేండ్లు సహజీవనం చేశారు. 2019 డిసెంబర్ 31వ తేదీన నటాషాకు దుబాయ్‌లో పాండ్యా ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత 2020లో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వారికి అగస్త్య అనే ఒక బాబు ఉన్నాడు. 2023 ఫిబ్రవరి 14వ తేదీన ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో హిందూ, క్రైస్తవ సంప్రదాయంలో మరోసారి అంగరంగ వైభవంగా హార్దిక్, నటాషా పెళ్లి చేసుకున్నారు.
ప్రేమ.. డేటింగ్.. పెళ్లి.. పెటాకులు
సవ్యంగా సాగుతున్న వారి కాపురంలో కొన్ని నెలలుగా కలహాలు మొదలయ్యాయి. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోవాలని ఎప్పుడో డిసైడయ్యారు. అందులో భాగంగా కొన్ని నెలల కిందట నటాషా తన సోషల్ మీడియాలో హార్దిక్‌తో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించింది. ఇంకా పేరు పక్కన పాండ్యా అనే పేరును తీసేసింది. అప్పట్లో 'ఒకరు రోడ్డున పడబోతున్నారు' అని ఒక పోస్టు చేయడంతో హార్దిక్ పాండ్యానే తన ద్వారా రోడ్డున పడనున్నాడని ముందే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
భారీగా ఆస్తి నష్టం?
అయితే నటాసా విదేశీయురాలు కావడంతో విడాకుల వ్యవహారం కీలకమైనది. విదేశస్తురాలిని పెళ్లి చేసుకోవడంతో హార్దిక్ పాండ్యా విడాకులు ఇవ్వడంతో భారీగా ఆస్తిని కోల్పోయినట్టు తెలుస్తోంది. విదేశీయురాలితో విడాకులు తీసుకుంటే దాదాపు 70 శాతం ఆస్తులు భరణం కింద రాసి ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా మనదేశ చట్టాలు ఉన్నాయి. విడాకులు పొందిన హార్దిక్ పాండ్యా నటాషాకు 70 శాతం ఆస్తులు భరణం కింద ఇవ్వాల్సి ఉంటుంది.
ఎప్పటికైనా విడాకులు వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన హర్దిక్ ముందు జాగ్రత్త పడ్డాడు. ఆస్తులన్నిటిని తన తల్లి పేరిట రాయించుకున్నాడు. తాను సంపాదించిన ప్రతి రూపాయిలో 50 పైసలు తన తల్లి పేరిట రాస్తున్నట్లు చాలాసార్లు చెప్పాడు. అతడి ఆస్తులు దాదాపుగా తల్లి పేరు మీదుగానే ఉన్నాయి. నామమాత్రంగా మాత్రమే హార్దిక్ తన ఆస్తులను రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు అదే హార్దిక్ మేలు చేసే అవకాశం ఉంది. తల్లి పేరిట సగం ఆస్తులు ఉండగా.. హార్దిక్ తన పేరు మీద అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు. విడాకులు తీసుకోవడం చట్టం ప్రకారం నటాషాకు హార్దిక్ తన ఆస్తుల్లో 70 శాతం రాసి ఇచ్చి ఉంటాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి