కాఫీ విత్ కరణ్ అనే టీవీ షోలో కరణ్ జొహర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి టీమిండియా జట్టు నుంచి సస్పెన్షన్‌కు గురైన క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ స్థానాలను యువ ఆటగాళ్ళు అయిన ఆల్‌రౌండ‌ర్‌ విజయ్ శంకర్‌, బ్యాట్స్‌మ‌న్ శుభ్‌మ‌న్ గిల్‌లతో భర్తీ చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న 2వ, 3వ వన్డేల్లో ఈ ఇద్దరు ఆటగాళ్ళు జట్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆసిస్‌తో జరిగిన మొదటి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా రెండో వ‌న్డేలో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్ళు ఇప్పటికే అడిలైడ్‌ చేరుకోగా విజయ్ శంకర్‌, శుభ్‌మ‌న్ గిల్‌ సైతం అడిలైడ్ వెళ్లనున్నారు.