ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్
ఆరంభంలోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆరంభంలోనే అత్యంత స్వల్పమైన స్కోర్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట ఓపెనర్ మురళీ విజయ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ అయి పెవిలియన్ చేరగా ఆ తర్వాత మరో ఓపెనర్ రాహుల్ సైతం 2 పరుగులకే హజెల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన చివరి పది ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అవడం ఇది ఆరోసారి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 277/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్రస్తుతం భారత్ 32 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు మాత్రమే చేసింది. చటేశ్వర్ పుజారా 23 (4 x 1), విరాట్ కోహ్లీ 37 పరుగులతో (4 x 5) క్రీజులో ఉన్నారు.