Ravi Teja- ODI WC 2023: మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Movie) అనే పాన్ ఇండియా మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో వరుసగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ వస్తున్నాడు రవితేజ. అయితే వన్డే వరల్డ్ కప్(Cricket World Cup)లో భాగంగా.. ఇవాళ టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో(IND VS AUS) ఆడుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్‌ లైవ్ కామెంటరీలో పాల్గొన్నాడు రవితేజ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్ తో చిట్ చాట్ చేశాడు ఈ హీరో. ఈ చిట్‌ చాట్‌ సెషన్‌లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రవి. మీరు బయోపిక్ చేయాల్సి వస్తే ఏ క్రికెటర్ జీవితకథలో నటిస్తారని అడుగగా.. సిరాజ్ అని చెప్పాడు మాస్ మహారాజ్. అంతేకాకుండా విరాట్‌ కోహ్లీ ఆటిట్యూడ్‌, దూకుడు అన్న చాలా ఇష్టమని చెప్పాడు. తాజాగా రవితేజ చేసిన కామెంట్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో హైదరాబాదీ పేసర్  బయోపిక్ లో రవితేజ కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఫ్యాన్స్. 


అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన గా నటిస్తోంది. ఇందులో సీనియర్ నటి రేణూ దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ  తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 



Also Read: BB 7 Updates: వీకెండ్ ఎపిసోడ్ కు అతిథులుగా సిద్ధార్ధ్, రవితేజ.. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హాట్ బ్యూటీలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి