భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్(95) ఇకలేరు. గత కొంతకాలం నుంచి మెదడు సంబంధిత సమస్యతో పంజాబ్ మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బల్బీర్ సింగ్ నేటి (మే 25) ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణాల పంట పండించిన ఘనత ఆయన సొంతం.  భారత హాకీ జట్టు 3 స్వర్ణ పతకాలు గెలవడంలో కీలకపాత్ర పోషించారు బల్బీర్ సింగ్.  వివాహేతర సంబంధం.. చిన్నారి సహా 9 మంది హత్య


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒలింపిక్ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిన 16 అత్యుత్తమ హాకీ ఆటగాళ్లలో బల్బీర్ సింగ్ సీనియర్ ఒకరు. ఈ క్రమంలో ఈ నెల 8న ఆరోగ్యం క్షీణించడంతో హాకీ దిగ్గజాన్ని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. మూడు వరుస ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణాలు నెగ్గడంలో బల్బీర్ సింగ్ కీలకపాత్ర పోషించడం తెలిసిందే.  మల్టీ టాలెంటెడ్ భానుశ్రీ లవ్లీ ఫొటోషూట్


1948, 1952, 1956లలో వరుసగా భారత్ స్వర్ణాలు కైవసం చేసుకుంది. బల్బీర్ సింగ్ అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేశారు. ముఖ్యంగా 1952 హాకీ ఒలింపిక్స్ ఫైనల్‌లో 1952లో నెదర్లాండ్‌పై చేసిన రికార్డు నేటికి పదిలంగానే ఉంది. ఒలింపిక్స్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత గోల్స్ చేసిన ఆటగాడిగా నేటికి బల్బీర్ సింగ్ పేరిట ఆ రికార్డు ఉండటం విశేషం.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..


వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్